ప్రచారం కాదు... నిజమే సుమా...!

Update: 2017-12-12 02:30 GMT

భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏం చేసినా సంచలనమే. తాజాగా తన పెళ్లి విషయంలో కూడా విరాట్ సంచలనమే సృష్ట్టించాడు. తన గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మ ను ఎట్టకేలకు పెళ్ళాడాడు కోహ్లీ. అది ఇటలీలో కావడం విశేషం. ఆ విషయాన్ని కూడా తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి బాహ్యప్రపంచానికి వెల్లడించాడు కెప్టెన్. వాస్తవానికి కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. దాన్ని ఖండించిన కోహ్లీ అనుష్కలు సైలెంట్ గా ఇటలీ చెక్కేశారు. ఈనెల 12 న వారి పెళ్ళి అంటూ ప్రచారం సాగిన ఆ తేదికి ముందే కోహ్లీ అనుష్కలు ఒక్కటయ్యారు. ఈనెల 21 న ముంబాయి లో గ్రాండ్ రిసెప్షన్ తో అందరిని అలరించనున్నాడు ఈ డాషింగ్ కెప్టెన్.

నేను రోబోను కాను విశ్రాంతి కావాలన్న కోహ్లీ ....

నేను రోబోను కాదు నాకు విశ్రాంతి కావాలంటూ శ్రీలంక టూర్ కి ముందు తరువాత కూడా కోహ్లీ కామెంట్ చేశాడు. బిసిసిఐ కూడా కోహ్లీ కి విశ్రాంతి అవసరమని భావించి శ్రీలంక టూర్ లో వన్డేలకు విశ్రాంతి ఇచ్చారు. ఫ్రెష్ గా సౌత్ ఆఫ్రికా టూర్ కి రెడీ అవుతున్నాడు అనుకున్న దశలో పెళ్ళి కోసమే కోహ్లీ విశ్రాంతి కోరుకున్నట్లు ఇప్పుడు అందరికి అర్ధమైంది. మొత్తానికి ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురు చూసిన కోహ్లీ అనుష్క పెళ్ళి తాను కోరుకున్న విధంగానే కెప్టెన్ మ....మ అనిపించడం విశేషం. ఇప్పుడు కోహ్లీ అభిమానుల ఆనందానికి అవధులే లేవు. పెళ్ళికి ముందు డబుల్ మీద డబుల్ సెంచరీలు కొట్టింది పెళ్ళి బాజాలకోసమే అని ఇప్పుడు ఫ్యాన్స్ కి తేటతెల్లం అయ్యింది.

Similar News