ప్రకాశ్ రెడ్డి రాజీనామా ఎందుకు చేశారంటే?

Update: 2018-03-27 02:19 GMT

తెలంగాణ అడ్వకేట్ జనరల్ ప్రకాశ్ రెడ్డి రాజీనామా చేశారు. తెలంగాణ అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇద్దరి బహిష్కరణ కేసులో ప్రభుత్వం తీరు పై మనస్తాపం చెందినట్లు సమాచారం. ఎన్నో కేసుల నుంచి ప్రభుత్వాన్ని గట్టెక్కించినా.. ప్రభుత్వం పెద్దల నుంచి సహాయసహకారాలు లేకవని సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. ప్రకాశ్ రెడ్డి రాజీనామా పై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

మనస్తాపం చెంది.....

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన న్యాయవాది ప్రకాశ్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు మనస్థాపం చెందినట్లు తెలుస్తుంది. జూలై 18న తెలంగాణ రెండో అడ్వకేట్ జనరల్ గా బాధ్యతలు చేపట్టిన ప్రకాశ్ రెడ్డి , ప్రభుత్వాన్ని ఎన్నో చిక్కుల్లో నుంచి బయటపడేశారని మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే అసెంబ్లీ నుంచి ఇద్దరి ఎమ్మెల్యేల పదవులను రద్దు చేస్తూ.. గెజిట్ విడుదల చేశారు. ఆ కేసులో కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఎన్నికల కమిషన్ కు 6 వారాల పాటు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత వీడియో ఫోటేజీని సమర్పించాలని కోరింది. ఇందుకు అడ్వకేట్ జనరల్ ఒప్పుకున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఓ సీనియర్ మంత్రి ఫోన్ చేసి ఎందుకు కమిట్ మెంట్ ఇచ్చారని మందలించినట్లు సమాచారం. సి.ఎం. కలవాలని సూచించినా.. అడ్వకేట్ జనరల్ ప్రకాశ్ రెడ్డి కలిసేందుకు సుముఖం చూపలేదని తెలుస్తోంది.

హరీష్ సాల్వేను....

ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాల రద్దు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం సుప్రీంకోర్టు సినియర్ న్యాయవాది హారిష్ సాల్వేను పిలిపిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రకాశ్ రెడ్డికి సమాచారం ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్థాపం చెందినట్లు తెలుస్తుంది. కోర్టుల కేసులు తలనొప్పిగా మారినట్లు తెలుస్తుంది. రాజ్యంగానికి విరుద్ధంగా, నిబంధనలు అతిక్రమించి ప్రభుత్వం పలు విధానపరమయిన నిర్ణయాలు తీసుకోవడం.. అవి కోర్టుల్లో నిలబడకపోవడంతో ఏజీగా ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. కేసులను గట్టెక్కిచాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఇటు ప్రభుత్వం పెద్దల నుంచి సహాయసహకారాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది.

ఈరోజు విచారణలో.....

ఇక అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచందర్ రావుకు, ప్రకాశ్ రెడ్డికి విబేదాలు తారాస్థాయికి చెందినట్లు తెలుస్తుంది. తనకు తెలియకుండా ప్రభుత్వం నుంచి ఎన్నో విషయాల్లో తలదూర్చి అసలు విషయాన్ని పక్కదారికి పట్టించారనే సమాచారం ఉంది. గతంలో రామకృష్ణారెడ్డితో రామచందర్ రావు కు విబేదాలు ఉండేవని న్యాయవాదులు అనుకుంటున్నారు. మంగళవారం కోమటిరెడ్డి ,సంపత్ పిటిషన్ పై విచారణ రాబోతుండటంతో ఎవరు వాదనలు వినిపిస్తారు. గతంలో అసెంబ్లీలో జరిగిన వీడియో ఫుటేజీ సమర్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందనే అంశాలు అసక్తిగా మారాయి.

Similar News