ప్రకటనలకు, ప్రాక్టికాలిటీ కి పొంతన లేదు బాబోయ్

Update: 2016-12-01 04:40 GMT

ప్రజలకు నోటు కష్టాలు ఇప్పుడే ఒక కొలిక్కి రావడం లేదు. అయితే ప్రజల కష్టాలను వీలైనంత తగ్గించడానికి ప్రభుత్వాలు భారీగానే కసరత్తు చేస్తున్నాయి. నిజానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఉపశమన చర్యలకంటే జనం కష్టాల గురించి రాష్ట్ర ప్రభుత్వాలు చూపిస్తున్న శ్రద్ధే ఎక్కువ. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వాలు, ప్రజలకు ఊరట కలిగేలా రకరకాల ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఆచరణలో అవేమి కనిపించడం లేదు.

రోజుకు 10 వేలు విత్ డ్రా చేసుకోవచ్చునని, వారానికి 24 వేలు డ్రా చేసుకోవచ్చునని కేంద్రం ప్రకటించినా అది అదే రీతిలో అమలయిన చరిత్రే లేదు. చెక్ లో ఎంత మొత్తం రాసినా సరే అందులో 2000 మాత్రమే బ్యాంకు లలో ఇస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న అన్ని ప్రకటనలూ ఇలాగె నీరుగారిపోతున్నాయి. ఒకవైపు చంద్రబాబు బ్యాంకు లలో డబ్బు లేదనే పుకార్లు నమ్మవద్దు అంటారు. మరొకవైపు బ్యాంకు లలో నగదు ఇవ్వడం లేదు. 90 శాతం ఎటిఎం లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

అలాగే ఉద్యోగులకు 10000 తీసుకోవచ్చు అని ప్రభుత్వాలు అంటున్నాయి. బ్యాంక్లలో అంత నగదు ఇస్తారో లేదో తెలియని పరిస్థితి. వృద్ధులకు ప్రత్యెక కౌంటర్ లు అంటున్నారు. అసలు బ్యాంకు లలో డబ్బే లేనప్పుడు ఈ ప్రకటనలన్నీ హాస్యాస్పదం అవుతున్నాయి. నాయకుల ప్రకటనలకు , ఆచరణలో వాస్తవాలకు అసలు సంబంధం ఉండడం లేదని జనం ఆవేదన చెందుతున్నారు.

Similar News