పోలవరం ప్రాజెక్టును జనసేన అధినేత పవన్ కల్యాణ్ సందర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు కూడా పవన్ కు ప్రాజెక్టు పనులపై పూర్తి వివరాలను అందిస్తున్నారు. ఎప్పటికి ప్రాజెక్టు పూర్తవుతుందన్న విషయాన్ని పవన్ అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా అభిమానులు పవన్ ను వదలలేదు. పీకే జిందాబాద్ అంటూ నినాదాలతో మార్మోగించారు. అయితే ఇందుకు పవన్ కల్యాణ్ మాత్రం ఇది సినిమా కాదని, తాను పనిమీద వచ్చానని అభిమానులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఒక దశలో సీరియస్ అయ్యారు. దాదాపు రెండుగంటల పాటు పవన్ పోలవరం ప్రాజెక్టు వద్ద ఉండే అవకాశం ఉంది. తర్వాత రాజమండ్రి బయలుదేరి వెళతారు. పవన్ రాకసందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. పోలవరానికి ఇంతవరకూ అయిన ఖర్చు....ఇంకా కావాల్సిన ఖర్చు గురించి పవన్ ఆరా తీశారు. పవన్ కల్యాణ్ తొలిసారి పోలవరం ప్రాజెక్టును సందర్శించడంతో రాజకీయంగా కొంత హీటెక్కిందనే చెప్పొచ్చు. పోలవరం గురించి పవన్ ఇప్పటి వరకూ మాట్లాడలేదు. ఆయన దీనిపై అథ్యయనం చేసిన తర్వాత రాజమండ్రిలో విలేకర్లతో పోలవరం విషయం మాట్లాడే అవకాశం ఉంది.