పాలిటిక్స్ లోకి వచ్చి పాడై పోయాడా?

Update: 2017-12-14 02:30 GMT

జరగకూడనిది జరిగిపోయాకా ఏమనుకొని ఏమి లాభం. జార్ఖండ్ కి ముఖ్యమంత్రిగా ఒక వెలుగు వెలిగి బొగ్గు గనుల్లో నాలుగు వేలకోట్ల రూపాయల ముడుపులు నొక్కేశారన్న ఆరోపణల తో జీవితం చీకటి చేసుకున్నారు మధుకోడా. ఈ కేసులో మధుకోడా కు శిక్ష తప్పదని ఢిల్లీ లోని సిబిఐ కోర్టు తేల్చేసింది. దాంతో మధుకోడా కుటుంబ సభ్యుల వేదన అంతా ఇంతా కాదు. రాజకీయాలు వద్దు వద్దు వ్యవసాయం చేసుకో అంటే వాడు వినలేదని మధు తండ్రి మధన పడుతున్నారు ఇక సోదరి స్టీల్ ప్లాంట్ ఉద్యోగం వస్తే మధుకోడా వదిలేసి రాజకీయాల్లో పడి జీవితం నాశనం చేసుకున్నారని వాపోతుంది.

విలాసవంత జీవితాన్ని కోరుకుని ....

సామాన్య వ్యవసాయ కుటుంబ నేపధ్యం నుంచి వచ్చిన మధుకోడా లక్ష్యం విలాసవంత జీవితం గడపడం. అందుకోసం మధుకోడా నిద్రలేని రాత్రులే గడిపారు. తన లక్ష్య సాధనకు అనుగుణంగా జీవితంలో ఒక్కోఅడుగు పైకి ఎదుగుతూ వచ్చారు. సాధించిన ఉన్నతితో తృప్తి పడలేదు. ఆపార సంపద సముపార్జన లక్ష్యంగా అడ్డదారుల్లో ప్రయాణించారు. జార్ఖండ్ గనులను ప్రయివేట్ పరం చేసేందుకు లంచంగా నాలుగు వేలకోట్ల రూపాయలు టార్గెట్ చేసి అడ్డంగా బుక్ అయ్యారు. మధుకోడా కు ఇప్పుడు శిక్షను కోర్టు ధృవీకరించింది. శిక్షాకాలాన్ని ప్రకటించాలిసి వుంది. ఈరోజు శిక్షపై విచారణ జరగనుంది.

Similar News