‘నేను ఒంగోలు, నెల్లూరులో చదువుకున్నాను. సమాజంలో మార్పు తేవాలన్నదే నా థ్యేయం. సమాజం బాగుపడాలనే కలతోనే తాను రాజకీయాల్లోకి వచ్చాను. గత మూడు సంవత్సరాలుగా పార్టీని ఎలా నడిపిస్తావు. డబ్బులు లేవు. వెనక ఎవరూ లేరు. అని అనేకమంది నన్ను ప్రశ్నించారు. అయితే ఈరోజు నేను ప్రారంభించిన ప్రయాణంలో వేలాది మంది చేరారు. నేను వేల కోట్లు కోరుకోవడం లేదు. వివేకానంద ఆశించిన వారిలో ఒక్కడిని అయితే చాలు. రాజకీయ వ్యవస్థలో జవాబుదారీ తనం కావాలి. నేను పదో తరగతి నెల్లూరులో చదివేటప్పుడే రాజకీయాల్లోకి రావాలనుకున్నా. జవాబుదారీ తనం, పారదర్శకత, సామాజికబాధ్యత మూడూ అవసరం. జనసేన కార్యకర్తల్తో క్రమశిక్షణ అవసరం. ఒక్కొక్క కార్యకర్త కోహినూర్ డైమండ్ లా తయారవ్వాలి. ఒకరిని ప్రశ్నించాలంటే మనకు నిబద్ధత కావాలి. ఎన్నికష్టాలు, ఇబ్బందులు వచ్చినా జనసేనను ముందుకు తీసుకెళ్తూనే ఉంటా. మీ కోసమే నేను రాజకీయ కూలీగా మారాను. ప్రత్యేకహోదా ఇస్తానని చెప్పి మాట తప్పారు. సీఎం అనే పదవి చాలా బాధ్యతతో కూడుకున్నది. దానికి అనుభవం కావాలి. మీరు సీఎం అని అరిచినా నా ఛాతీ పొంగదు. దేశ అభివృద్ధి జరగాలంటే కులాల మధ్య సమైక్యత కావాలి.
ఉద్యమం చేయాలంటే...
ప్రత్యేక హోదా గురించి ఎందుకు పోరాటం చేయడం లేదు నన్ను కొందరు అడుగుతున్నారు. కాని నాకో అనుమానం. ప్రత్యేక హోదా కోసం యువత త్యాగాలు చేయగలరా? మీరు సిద్ధంగా ఉన్నారా? తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధంగా ఉందా? మోడీ బలమైన ప్రధాని. ఆయన ఉన్న ప్పుడు ఒక ఉద్యమాన్ని తీసుకెళ్లడం కష్టమే. కాని నాకు భయం లేదు. ఇది జనసేన వ్యక్తిగత కోరిక కాదు. కోట్లాదిమందికి మీరు ప్రామిస్ చేశారు ప్రత్యేక హోదా ఇస్తామని. కానీ బీజేపీ మోసం చేసింది. జనసేన పార్టీ మాట తప్పదు. గతంలో నేను మద్దతిచ్చాను. నావల్ల ఎంత శాతం ఓట్లు వచ్చాయన్నది నాకు తెలియదు. నేను ఉడతా భక్తీ సాయం చేశాను. ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను మభ్యపెట్టవద్దని టీడీపీ ప్రభుత్వాన్ని కోరుతన్నాను. తప్పు లేకపోతే కేంద్రాన్ని నిలదీయవచ్చు. నా దగ్గర నైతిక బలం ఉంది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గాని, ప్రతిపక్షం కాని అడగలేకపోవడానికి నైతిక బలం లేకపోవడమే. నేను పాలిటిక్స్ లో రెచ్చగొట్టడానికి రాలేదు. సామరస్య పూర్వకంగానే పరిష్కరించుకోవాలి. తెలంగాణ నేత రేవంత్ రెడ్డి ఏపీ మంత్రులపై విమర్శలు చేయడం మీకు విన్పించలేదా?’ అని పవన్ ప్రశించారు. ఒంగోలు జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ మాట్లాడారు.