పారిశ్రామికవేత్తలకు మోడీ సలహా ఇదే...!

Update: 2017-11-28 12:29 GMT

‘ఈసదస్సుకు ఆతిథ్యం వహించడం ఆనందంగా ఉంది. ఈ సదస్సుకు హాజరయినందుకు ఇవాంకాకు ప్రత్యేక ధన్యవాదాలు. దక్షిణాసియాలో ఈ సదస్సు జరగడం ఇదే తొలిసారి. మహిళ శక్తి భారత్ లో అపారం. భారత్ లో మహిళను దేవతగా పూజిస్తారు. పురాణాల్లో మహిళలను శక్తికి ప్రతీకలుగా నిలుస్తారు. ఝాన్సీలక్ష్మీబాయి వీరనారీమణులు మనకు ఆదర్శం. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ భారత్ మూలాలున్న వాళ్లే. హైదరాబాద్ లో కూడా మహిళలు అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు. సానియామీర్జా, సైనా నెహ్వాల్, పీవీ సింధూ లు హైదరాబాద్ నుంచి వచ్చి ప్రపంచస్థాయిలో తమ రంగంలో శాసించిన వారే. అంతరిక్ష పరిశోధనల్లోనూ మహిళ శాస్త్రవేత్తల కృషి ప్రశంసనీయం. భారత స్వాతంత్ర ఉద్యమంలోనూ మహిళల పాత్ర ప్రశంసనీయం. గుజరాత్ పాడి పరిశ్రమ విజయంలో మహిళల పాత్ర ఎంతో ఉంది. ఎంటర్ ప్రెన్యూర్స్, ఇన్వెస్టర్లను ఒకే వేదిక మీదకు తీసుకు వచ్చేందుకే ఈ సదస్సు. కేంద్ర ప్రభుత్వ చర్యల వల్లే ఈజ్ ఆఫ్ డూయింగ్ లో భారత్ ర్యాంకు మెరుగుపడింది. ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. హై కనెక్టివిటీ బ్రాండ్ బాండ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం. 2022 నాటికి భారత్ అగ్రగామి దేశంగా ఎదుగుతుంది. ముద్ర బ్యాంకు ద్వారా 70 లక్షల మంది మహిళలకు రుణాలిచ్చాం. మూడేళ్లలో పునరుత్పాదన సామర్థ్యాన్ని పెంచుకున్నాం. దివాలా సంస్థల చట్టాన్ని బలోపేతం చేస్తాం.

Similar News