పాతబస్తీలో మళ్లీ గ్యాంగ్ వార్ మొదలైంది.. రెండు గ్యాంగ్ లు కలిసి కొట్టుకుని ఒకరి హత్య చేసిన తీరు ఇది.. అయితే ఈ రెండు గ్యాంగ్ లు కూడా దొంగల ముఠాలు.. పోలీసులకు తమ సమాచారం లీక్ చేస్తున్నారన్న నెపంతో మరొక గ్యాంగ్ కు చెందిన వ్యకిని దారుణంగా హాత్య చేశారు. పాతబస్తీలో మళ్లీ గ్యాంగ్ వార్ జరుగుతుంది. ఇన్నాళ్లు గ్యాంగ్ వార్ కు పుల్ స్టాప్ పెట్టిన పోలీసులు. ఇప్పడు మళ్లీ గ్యాంగ్ వార్ మొదలైంది.. పాతబస్తీలో వుండే అక్బర్ ఒక దొంగ.. ఇతను చేస్తున్న దొంగతనాల తో పోలీసులు ఇతని పైన పిడి యాక్ట్ పెట్టారు పోలీసులు. అయితే పిడి యాక్ట్ తరువాత జైలు కు వెళ్లి వచ్చాడు అక్బర్. జైలునుంచివచ్చిన తరువాత అక్బర్ మళ్లీ తనపాత జీవితమే ఆరంభించాడు. ఇక్కడ వరకు బాగానే వుంది. ఇటివల కాలంలో తాను ఎక్కడైతే దొంగతనంచేయాలని ప్లాన్ చేస్తున్నాడో ఆదే ప్రాంతంలో పోలీసులు మకాం వేస్తున్నారు..రెండు సార్లు పోలీసులు కూడా అక్బర్ పట్టుకున్నారు.. తన ప్లాన్స్ మొత్తం కూడా పోలీసులకు ముందుగానే ఎలా తెలిసి పొతుందని అనుకున్నాడు అక్బర్.
పోలీసులకు సమాచారం అందిస్తున్నారని......
అయితే తన ప్రత్యర్దితో పాటుగా తనతో పాటుగా కొంత కాలంగా దొంగతనాలు చేసిన అక్రమ్ మీద అనూమానం వచ్చింది అక్బర్ కి. దీంతో నిన్న రాత్రి సమయంలో మాట్లాడుకుందాం రమ్మని చెప్ని అక్రమ్ ను రెయిన్ బజార్ శ్మశాన వాటికకు పిలిపించాడు దొంగ అక్బర్. అక్కడ రాత్రి అర్థరాత్రి పన్నెండు గంటల సమయంలో అక్రమ్ అక్కడికి వచ్చాడు.అయితే అందరు కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో అందరూ వుండగానే తన ప్లాన్స్ ను ఎందుకు పోలీసులు చెరవేస్తున్నావని చెప్పి అక్రమ్ ను నిలదీశాడు అక్బర్. అయితే పోలీసులకు, తనకు ఎలాంటి లింక్ లేదని తాను ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని చెప్పాడు అక్రమ్. తన సమచారాన్ని ఎప్పటికప్పడు పోలీసులకు చెబుతున్నావంటూ కత్తితో దాడి చేసి విచక్షణ రహితంగా పొడిచి చంపాడు.. అక్బర్. ఇదిలా వుంటే ఈ దొంగల మధ్య గ్యాంగ్ వార్ చివరకు ఒకరి ప్రాణాల మీదకు వచ్చిందని పోలీసులు చెప్పారు.