పాత లీడర్ బయటకు వచ్చేశారు

Update: 2018-03-30 03:30 GMT

కేంద్రంలోని బిజెపి రాజకీయాలు ఎపి సీఎం కి చిర్రెత్తేలా చేస్తున్నాయా ? రాబోయే విచారణలు కేంద్రం తీయనున్న కొరడాపై ఎదురుదాడి అస్త్రంగా బాబు నిలబడుతున్నారా ? అవుననే అంటున్నాయి ఆయన చర్యలు. ఇప్పడు చంద్రబాబు లో పాత నేత బయటకు వచ్చాడు. మోడీతో విసిగి వేసారిన బాబు లాభం లేదని 2019 ఎన్నికల్లో ఆయన్ను మార్చేస్తా అంటున్నారు. గతంలో పలువురు ప్రధానులను ఎంపిక చేయడం గుర్తు చేస్తూ వచ్చేసారి దేశంలో కొత్త ప్రధాని ఎవరో తానే డిసైడ్ చేసేస్తా అని బల్లగుద్దేస్తున్నారు.

బాబు అసలు ఉద్దేశ్యం అదేనా ...?

వాస్తవానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కి చేస్తున్న హడావిడి చంద్రబాబు చేయాలిసింది. జాతీయ రాజకీయాలు, రాష్ట్రంలో జరుగుతున్న వేగవంతమైన మార్పులతో బాబు కేసీఆర్ లా ఈ టర్మ్ స్పీడ్ కాలేక పోయి వెనుకబడ్డారు. ఎన్నికలకు ఏడాది ముందే థర్డ్ ఫ్రంట్ కి ప్రాణం పొసే ప్రక్రియను చేజేతులా కేసీఆర్ కి అప్పగించడంతో బాబు రాష్ట్ర రాజకీయాలు, టిడిపి ప్రయోజనాలు లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అయితే ఢిల్లీ లో పట్టు లేకుండా గల్లీలో ఏమి జరగదన్న బలమైన నమ్మకంతో ఈసారి పావులు కదపనున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే వచ్చే ఎన్నికల్లో ప్రధానిని ప్రకటించేది టిడిపే నంటూ సవాల్ విసిరారు. ఆయన ఘాటు వ్యాఖ్యలపై బిజెపి శ్రేణులు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

Similar News