పాకిస్తాన్ లో ఉగ్రవాదులు తీవ్రమైన దురాగతానికి ఒడిగట్టారు. పోలీసుల శిక్షణ కళాశాలపై దాడిచేశారు. ఈ దాడిలో ఏకంగా 60 మంది ట్రైనింగ్ లో ఉన్న పోలీసులను ఉగ్రవాదులు మట్ట్టుపెట్టారు. పెద్దసంఖ్యలో.. శిక్షణార్థులైన పోలీసులను తమ నిర్బంధంలోకి తీసుకున్నారు. ఎంతమందిని నిర్బంధంలోకి తీసుకున్నారన్న సంగతి కూడా స్పష్టంగా తెలియడం లేదు. దాడి సమయంలో ట్రైనింగ్‌లో 500 నుంచి 600 మంది వరకు ఉన్నట్లు మాత్రమే సమాచారం తెలుస్తోంది. వారిలో సుమారుగా 250 మందిని పోలీసులు కాపాడగలిగారు. అయితే పాకిస్తాన్ లో ఉగ్రవాద కార్యకలాపాలు శృతిమించుతున్నాయంటూ ప్రపంచ దేశాలు ఘోషిస్తోంటే... మిన్నకుంటూన్న అక్కడి ప్రధాని నవాజ్ షరీఫ్‌కు .. కనీసం ఇప్పటికైనా.. తాము పెంచుతున్న విషనాగులు తమనే కాటేస్తున్నప్పటికైనా బుద్ధి వస్తుందా అని విశ్లేషకులు భావిస్తున్నారు.
పాకిస్తాన్‌లోని క్వెట్టాలోని పోలీసు శిక్షణ కాలేజీపై ఈ ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో 60 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. ఇస్లామిక్ తీవ్రవాదులు పాకిస్తాన్ లో కూడా పెద్దఎత్తున దాడులకు, విధ్వంసాలకు పాల్పడడం ఇది కొత్తేమీ కాదు. కానీ ప్రభుత్వాలు మాత్రం ఉగ్రవాదులకు ఊతమిస్తూనే ఉంటాయనే ఆరోపణలు ఎదుర్కొంటుంటాయి.
ప్ర్రస్తుత దుర్ఘటనలో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో .. రక్షణ నిమిత్తం వెళ్లిన భద్రతా బలగాల వారు ముగ్గురు తీవ్రవాదుల్ని మాత్రం మట్టు పెట్ట గలిగారు. ఎందు ట్రైనింగ్ పోలీసులు ఉగ్రవాదుల నిర్బంధంలో ఉన్నారో స్పష్టంగా తెలియకపోవడంతో ఉత్కంఠ నెలకొని ఉంది.