పవన్ కళ్యాణ్ విభిన్న మనస్తత్వం వున్న వ్యక్తి . అది ఎంత విభిన్నం అంటే మెగాస్టార్ చిరంజీవికి సైతం అందనంత. అలాంటి పవన్ పై టిడిపి మంత్రులు వేస్తున్న సెటైర్స్ కి ఆయనకు ఎక్కడ కాలాలో అక్కడ కాలిపోతుంది. కేంద్ర మంత్రి అశోక్ గజపతి పవన్ ఎవరో తెలియదని అంటే అన్నారు మంత్రి పితాని కూడా అదే తీరులో వ్యాఖ్యానించడం వచ్చే ఎన్నికలకు తమ ప్రధాన ప్రత్యర్థి వైసిపి అని తేల్చేయడం జనసేన అధినేతను హర్ట్ చేశాయని ఆ పార్టీ వర్గాల టాక్ . దీనిపై ఇప్పటికే జనసేన బృందం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు పికె ఫ్యాన్స్.
పవన్ ట్వీట్ అందుకేనా ...?
కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు కి పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని అంటారు . రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ అలాగే వ్యాఖ్యానించారు సంతోషం అంటూ ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ స్పందించారు . ఆయన స్పందన లోనే పవన్ ఎంత హర్ట్ అయ్యారో అర్ధమైపోతుంది . పవన్ ట్విట్టర్ లో స్పందించాక ఏపీ సీఎం ఈ అంశం సీరియస్ గా తీసుకున్నారు . ఎవరు సున్నిత అంశాలపై మాట్లాడకండి . పార్టీ అధినాయకత్వం ఇలాంటి అంశాలపై సమయం వచ్చినప్పుడు స్పందిస్తుంది . మీరు విడిచిపెట్టండి అంటూ మంత్రులను. చంద్రబాబు హెచ్చరించారు