పవన్ విషయంలో ఫుల్లు క్లారిటీతో జగన్...!

Update: 2018-01-31 13:33 GMT

జనసేన గురించి జగన్ ఫుల్లు క్లారిటీతో ఉన్నారు. జనసేన వల్ల తమకు కొత్తగా వచ్చే నష్టమేమీ ఉండదని ఆయన చెప్పారు. పవన్ కల్యాణ్ ను అభిమానించే వారంతాత గత ఎన్నికల్లో టీడీపీకే ఓట్లేశారన్నారు. అందువల్ల ఇప్పుడు జనసేన కారణంగా కొత్తగా తమ పార్టీకి వచ్చే నష్టమేదీ లేదని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ఊరూరా తిరిగి పవన్ కల్యాణ్ టీడీపీకే ఓటేయమని చెప్పారన్నారు. మోడీ మీద అభిమానం, పవన్ కల్యాణ్ అభిమానులు ఓట్లేస్తేనే చంద్రబాబు గత ఎన్నికల్లో గెలిచారన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తాము కొత్తగా నష్టపోయేదేమీ లేదన్నారు. పొత్తులపై ఎన్నికలకు ముందు ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఒక తెలుగు మీడియాన్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రాబందుల రాజ్యమేలుతుందన్నారు. రికార్డులను మార్చేసి విలువైన భూములను కబ్జా చేస్తున్నారన్నారు. రాష్ట్రమంతా మాఫియా రాజ్యమేలుతుందన్నారు. జన్మభూమి కమిటీలతో పాటు స్థాయిని బట్టి దోపిడీచేస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత భూ రికార్డులన్నింటినీ ప్రక్షాళన చేసి పేదలకు వారి భూములను వారికి అప్పగిస్తామని చెప్పారు.

Similar News