పవన్ ప్లేట్ మార్చాశారే.....!

Update: 2017-12-10 05:30 GMT

2014 ఎన్నికల ప్రచారం ముగిసి బిజెపి టిడిపి సర్కార్ అధికారంలోకి వచ్చాక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్కూల్ తాత్కాలికంగా కొంత కాలం మూసేసారు. ఎక్కువ సినిమాలకే తన సమయం కేటాయిస్తూ వచ్చారు. జనసేన పార్టీ నిర్మాణం అదిగో ఇదిగో అంటూ ట్విట్టర్ కే పరిమితం అయ్యారు. అడపాదడపా రాజధాని భూముల కోసం రైతులకోసం నేను అంటూ ఇలా ఆరు నెలలకో సమస్యపై మాత్రమే గ్రౌండ్ లోకి వచ్చే వారు. భవిష్యత్తులో జనసేన పార్టీ జనంలో ఉండేలా లేదని ప్రజలు అనుకుంటున్న తరుణంలో ప్రత్యేక హోదా అంశంపై సీరియస్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆంధ్ర, రాయలసీమల్లో సభలు పెట్టి కేంద్రానికి తొడకొట్టారు. పనిలో పని టిడిపి పై ఏదో విమర్శించాలి కనుక అన్నట్లు బిజెపి స్థాయిలో కాకుండా సుతిమెత్తగా విమర్శలు కురిపించారు. జనసేన అభిమానుల్లో ఉత్సహం నెలకొంది. ఇంకేముంది తమబాస్ వచ్చేశాడని అనుకున్నాక ఈ వ్యవహారంపై నాలుగైదు ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చి సైలెంట్ అయి పోయి సినిమా షూటింగ్స్ లో బిజీ అయిపోయారు.

హోదా ఇచ్చే వరకు పోరాటం ఆగదన్న ...

పవన్ గతంలో ప్రత్యేక హోదా అంశంలో అనుసరించిన స్టాండ్ లో మార్పు వచ్చింది. ప్యాకేజి ఎవడికి కావాలి పాచి లడ్డులు ఇస్తారా అని కాకినాడ సభలో గద్దించిన స్వరం నేడు ఒంగోలు సభకు వచ్చే టప్పటికి మారిపోయింది. హోదాపై పోరాడే పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. టిడిపి, వైసిపి పోరాడలేవన్న పవన్ అందుకే జనసేన ఉందని గతంలో తాను చెప్పిన మాటకు విరుద్ధమైన ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. మీరు పోరాటానికి సిద్ధమేనా అంటూ జనసేన కార్యకర్తలను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు. వారు మేం సిద్ధమని ప్రకటించినా పోరాడే పరిస్థితులు ఇప్పుడు లేవు మోడీ కి వ్యతిరేకంగా ఉద్యమించడం చాలా కష్టమని చెప్పి జనసైనికుల ఉత్సాహం నీరుగార్చారు. ఈ వ్యాఖ్యలతో జనసేనాని లో క్లారిటీ లోపించింది అనడానికి నిదర్శనంగా చెబుతున్నారు విశ్లేషకులు.. గతంలో టిడిపి, వైసీపీలు ఉద్యమించే స్థితిలో లేవంటూ గత ఎన్నికల్లో తాను మద్దత్తు ఇచ్చిన పార్టీలు ప్రజలను మోసం చేశాయంటూ, కేంద్రంపై జనసేన యుద్ధం చేసి హోదా సాధిస్తుందని ప్రకటించిన పవన్ లో సడన్ గా వచ్చిన ఈ మార్పు కి కారణం ఏమై ఉంటుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. దాంతో పవన్ హోదాపై చేతులు ఎత్తేసినట్లేనని అభిప్రాయపడుతున్నారు.

Similar News