జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టుకు బయలుదేరారు. కొద్దిసేపటి క్రితమే ఆయన హైదరాబాద్ లోని జనసేన కార్యాలయం నుంచి బయలుదేరారు. ఆయనకు భార్య లెజ్ నోవా హారతి ఇచ్చారు. మధ్యాహ్నం 3గంటలకు కొండగట్టుకు చేరుకుని పూజలు చేస్తారు. అక్కడి నుంచి నేరుగా కరీంనగర్ కు చేరుకుని ముఖ్య నేతలతో సమావేశమవుతారు. రాత్రికి కరీంనగర్ లోనే బస చేస్తారు. 23 ఉదయం కరీంనగర్ లోని జగిత్యాల రోడ్డులో ఉన్న ఫంక్షన్ హాలులో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన కార్యకర్తలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం భోజనం అనంతరం రేపు ఖమ్మం జిల్లా కొత్తగూడెం బయలుదేరుతారు. రేపు సాయంత్రం కొత్తగూడెంలో నే బస చేస్తారు. కొత్తగూడెంలో రోడ్ షో ఉండే అవకాశముంది. 24వ తేదీ ఉదయం కొత్తగూడెం నుంచి బయలుదేరి ఖమ్మం చేరుకుంటారు. 24 మధ్యాహ్నం ఖమ్మంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల నేతలతో సమావేశమవుతారు. ఎక్కడా ప్రజలను కలవడం కాని, సమస్యలను పరిశీలించడం కాని పవన్ పర్యటనలో ఉండవు. మూడు రోజుల పర్యటనలో పవన్ కల్యాణ్ కేవలం కార్యకర్తలతోనే సమావేశం కాననున్నారు.