పవన్ ప్రసంగం ఎలా ఉంటుందో?

Update: 2017-11-17 05:30 GMT

పవన్ కల్యాణ్ లండన్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు హౌస్ ఆఫ్ లార్డ్స్ సమావేశంలో ఇండో-యూరోపియన్ బిజినెస్ ఫోరం గ్లోబల్ ఎక్సెలెన్సీ అవార్డును పవన్ అందుకోననున్నారు. ఇందుకోసం ఆయన లండన్ చేరుకున్నారు. యూరప్ పర్యటనను ముగించుకున్న పవన్ కల్యాణ్ ఈరోజు లండన్ లో ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును అందుకున్నారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తర్వాత పలు సమస్యలపై స్పందించారు. ముఖ్యంగా ఉద్దానం కిడ్నీ బాధితుల విషయంలో పవన్ స్పందించిన తీరుకు ఫిదా అయిన బిజెనెస్ ఫోరం ఈ అవార్డును ప్రకటించింది.

అవార్డు అందుకోనున్న......

ముఖ్యంగా కళలు, రాజకీయాలు, సామాజిక సేవ చేసినందుకు పవన్ కల్యాణ్ ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. లండన్ లోని పవన్ కల్యాణ్ అభిమానులు పెద్దయెత్తున స్వాగతం పలికారు. లండన్ లో జనసేన అభిమానులతోనూ పవన్ సమావేశం కానున్నారు. ఆయన ఈ సందర్భంగా ప్రసంగించనున్నారు. సో... పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయంగా గుర్తింపు లభించడంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Similar News