పవన్ నిర్ణయంపై ఉత్కంఠ....!

Update: 2018-02-16 04:17 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు కీలక నిర్ణయం తీసుకోనున్నారా? అవుననే అనిపిస్తుంది. ఈరోజు జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమవేశం హోటల్ దసపల్లాలో జరగనుంది. ఈ సమావేశానికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, లోక్ సత్తా నేత జయప్రకాశ్ నారాయణ, సీపీఎం, సీపీఐ ఏపీ కార్యదర్శులు మధు, రామకృష్ణ, కాంగ్రెస్ నేతలు గిడుగు రుద్రరాజు, గౌతమ్, ఎమ్మెల్సీ నాగేశ్వర్ లు హాజరు కానున్నారు. మరికొందరు ఆర్థిక నిపుణులు కూడా హాజరవుతున్నారు. అయితే ఆసక్తికరమైన విషయమేంటంటే జేఎఫ్ సి సమావేశానికి వెళ్లేముందు పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడకుండానే పవన్ సమావేశానికి వెళ్లిపోయారు. దీంతో పవన్ నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ సమావేశం రెండు రోజుల పాటు జరగనుంది. కాగా పవన్ కల్యాణ్ ఏపీకి ఎన్ని నిధులు వచ్చాయో వివరాలివ్వాలని బీజేపీ, టీడీపీలను కోరారు. కాని అక్కడి నుంచి మాత్రం స్పందన లేదు.

Similar News