పవన్ ని టార్గెట్ చేస్తున్న బిజెపి ...!

Update: 2018-02-11 06:30 GMT

ఆ పార్టీకి శాసన సభలో కానీ పార్లమెంట్ లో కానీ ఒక్క సీటు లేదు. కానీ టిడిపి తో సమానంగా జనసేన ను బిజెపి టార్గెట్ చేస్తుంది. కారణం కొన్ని కీలక అంశాల్లో కేంద్రంపై నేరుగా దాడికి టిడిపి పవన్ కళ్యాణ్ ను ఆయుధంగా తమపై ఉపయోగిస్తుందని కమలనాధులు గ్రహించారు. జనసేన కు పొలిటికల్ గ్లామర్ కన్నా సినీ గ్లామర్ ఎక్కువగా ఉండటం పవన్ కి వున్న ప్రజల్లో వున్నక్రేజ్ తో బిజెపి తన వ్యూహాలను ఇప్పుడు అటు టిడిపి ఇటు జనసేన పై అమలు చేయడం మొదలు పెట్టేసింది. ఆ పార్టీ సీనియర్ నాయకులు జివిఎల్ నర్సింహా రావు కానీ సోము వీర్రాజు తాజాగా చేస్తున్న వ్యాఖ్యలు బిజెపి వ్యూహానికి అద్దం పడుతున్నాయి.

జనసేన జెఏసితో ...

తమ పార్టీ కి వున్న లొసుగులతో కేంద్రంపై నేరుగా యుద్ధం చేయలేని స్థితిలో వున్న టిడిపి రాజీనామా అస్త్రాలను కానీ, మంత్రి పదవులు వదులుకోవడం విషయంలో కానీ దోబూచులాడుతోంది. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టి జేఏసీ లాగే ఏపీ లో జేఏసీ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. దీనికి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ, ఉండవల్లి అరుణకుమార్ వంటి మేధావులను ముందుకు నడిపించే బాధ్యతలు అప్పగించాలనే ఆలోచన చేశారు. ఇదే ఇప్పుడు కమలనాధులను తీవ్రంగా కలవరపెడుతున్న అంశం. దాంతో ఇప్పుడు బిజెపి తన ఎటాక్ పవన్ పై అన్నది తేల్చేసింది. ఇటీవల సోము వీర్రాజు పదే పదే ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ ను పిలిచి ఈ విషయాలు వెల్లడించాలని అని సూచించారు. జివిఎల్ నరసింహ రావు అయితే మరింత ఘాటుగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. పవన్ చేసే ట్వీట్ లపైనే ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ రాజకీయాలు మాని ప్రజల్లో తిరగాలని సైతం సలహాలు ఇస్తున్నారు. దాంతో టిడిపి మైండ్ గేమ్ ను పవన్ ద్వారా కొత్త ఎత్తుగడలకు తెరతీసింది అనే అనుమానాలు బిజెపి కనిపెట్టేసిందే అనే చర్చ హాట్ టాపిక్ గా సోషల్ మీడియా లో నడుస్తుంది.

Similar News