పవన్ కు జగన్ సూటి ప్రశ్న

Update: 2017-12-07 07:55 GMT

వైసీపీ అధినేత జగన్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సూటి ప్రశ్నలు వేశారు. రాజకీయాల్లో అనుభవం కావాలంటున్న పవన్ కల్యణ్, చిరంజీవి ఎన్నికలకు ఆరునెలల ముందు ఏం అనుభవముందని ప్రజారాజ్యం పెట్టారని ప్రశ్నించారు. వైఎస్ పాలనలో అవినీతి జరిగిందంటున్న పవన్ కల్యాణ్ అదే పార్టీలో ప్రజారాజ్యాన్ని ఎలా విలీనం చేశారన్నారు. తాము బస్సుయాత్ర చేపట్టగానే పవన్ పోలవరం సందర్శించారని జగన్ అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ తో పొత్తు కోసం తామేమీ తహతహలాడటం లేదన్నారు. విశాఖ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సమస్యను పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లింది వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కాదా? అనిజగన్ ప్రశ్నించారు.

Similar News