పవన్ కీలక నిర్ణయం...అమలు రేపే

Update: 2018-03-11 13:30 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు విజయవాడ రానున్నారు. ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో నిలదొక్కుకునేందుకు ఆయన ఇక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. జనసేన పార్టీ ప్రకటించిన తర్వాత పవన్ కల్యాణ్ ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. అయితే ఈ విమర్శలకు సమాధానంగా గతంలో పవన్ కల్యాణ‌్ తాను ఏలూరులో ఇంటి నిర్మాణం చేపడతానని, అక్కడే ఉంటానని తెలిపారు.

గుంటూరు జిల్లా కాజా సమీపంలో.....

అయితే అనూహ్యంగా పవన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లాలో రెండు ఎకరాల స్థలం తీసుకుని పార్టీ కార్యాలయం నిర్మిద్దామనుకున్నారు. అయితే ఆ స్థలం వివాదంలో పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వేరే స్థలాన్ని పవన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా కాజా దగ్గర రెండు ఎకరాలను తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ స్థలంలో పార్టీ కార్యాలయంతో పాటుగా తన ఇంటి నిర్మాణాన్ని కూడా చేయాలని పవన్ భావిస్తున్నారు.

సొంత ఇంట్లోనే ఉండాలని.....

అందుకోసమే పవన్ కల్యాణ్ రేపు ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యాలయం, ఇల్లు ఒకే దగ్గర ఉండేలా ప్లాన్ రూపొందించారని తెలిసింది. రేపు ఉదయం 11 గంటలకు ఇంటి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో ఇల్లు ఉంది కాని అమరావతి దగ్గరలో లేదు. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి క్యాంపు కార్యాలయంలో ఉన్నారు. అలాగే ప్రతిపక్ష నేత జగన్ కు కూడా ఏపీలో సొంత ఇల్లు లేదు. ఇప్పుడు అమరావతికి సమీపంలో పవన్ కల్యాణ్ సొంత ఇంటి నిర్మాణాన్ని చేపట్టడం జనసేన వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

Similar News