పవన్ ఈ ట్విస్ట్ ఏంటి?

Update: 2018-03-07 09:30 GMT

ప్రజల భాగస్వామ్యం లేకుండా పార్టీలు ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. గుజ్జర్లు, తెలంగాణ ఉద్యమం తరహాలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేయాల్సి ఉంటుందని జనసేనాని అభప్రాయపడ్డారు. హోదాను అన్ని పార్టీలూ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నాయని పవన్ అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా కోసం అందరం కలిసి ఉద్యమం చేద్దామనుకుంటే ఆఖరి వరకూ నిలబడతారన్న నమ్మకం తనకు కలగడం లేదన్నారు.

వైసీపీతో ఉపయోగంలేదు....

తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. వైసీపీ అవిశ్వాసంతో ఉపయోగం లేదన్నారు. కేంద్రంతో సయోథ్యగా ఉంటే తప్పులేనప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సయోధ్యగా ఉండటంలో తప్పేమిటని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ చెప్పటం మంచిదేనన్నారు. దానిని స్వాగతిస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ లో విభజన చేశామన్న పశ్చాత్తాపం ఆపార్టీకి వచ్చినట్లుందన్నారు. కేంద్రమంత్రులు ఇప్పుడు రాజీనామా చేస్తే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. మాఫియా వాళ్లు మాటమీద నిలబడతారని, పొలిటీషియన్లు నిలబడరని పవన్ అభిప్రాయపడ్డారు.

ఇరవై ఏళ్లలో ద్రవిడ ఉద్యమం....

దేశంలో థర్డ్ ఫ్రంట్ అవసరమని పవన్ అన్నారు. ధర్డ్ ఫ్రంట్ అధికారం కోసం కాదని, హక్కులను కాపాడుకోవడం కోసమేననిచెప్పారు. దక్షిణాది నుంచే కాకుండా జిగ్నేశ్ లాంటి వాళ్లుకూడా కలిసి వస్తారన్నారు. టీడీపీ, వైసీపీ కేసులకు భయపడుతున్నాయన్నారు. తనపై కూడా ఐటీ దాడులు జరిగాయని పవన్ చెప్పారు. ఇలాగే వివక్ష కొనసాగితే మరో ఇరవై ఏళ్లలో ద్రవిడ ఉద్యమం వస్తుందని పవన్ చెప్పారు. కేంద్రంతో గొడవలు పెట్టుకోవద్దని రాష్ట్రప్రభుత్వం ఎదుకు అనుకోవాలన్నారు. హోదా ఇవ్వరని ప్రకటించినప్పుడు తాను చాలా డిసప్పాయింట్ మెంట్ కు గురయ్యానన్నారు. 2019 ఎన్నికలకు ముందు తన స్టాండ్ చెబుతానన్నారు. తాను చాలా ప్రాక్టికల్ గా ఉంటానని, అన్ని ప్రశ్నలకు ఈ నెల 14న సమాధానం చెబుతానని అన్నారు.

Similar News