తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నెమ్మదిగా పాతుకు పోతున్నారా? ఆయన అమ్మ ఆశయాలను క్రమంగా అమలు చేస్తున్నారు. జయ మరణించే ముందు చేసిన వాగ్దానాలను అమలు చేసే పనిలో పడ్డారు పళనిస్వామి. ఎన్ని విమర్శలు తనపై వస్తున్నా.... దినకరన్ మరోవైపు ప్రభుత్వాన్ని కూల్చి వేస్తాననిప్రతినలు చేస్తున్నా పళనిస్వామి మాత్రం తనపని తాను చేసుకుపోతున్నారు. పళనిస్వామి ముఖ్యమంత్రి అవుతారని ఆయనే ఊహించి ఉందరు. పన్నీర్ సెల్వం తిరుగుబాటుతో శశికళకు అత్యంత నమ్మకస్థుడైన పళనిస్వామి ఆమె జైలు కెళ్లిన తర్వాత పరిస్థితులు వాటంతట అవే చకచక మారిపోయాయి. దినకరన్ దూకుడుతోనే పళనిస్వామి ఇష్టం లేకున్నా పన్నీర్ సెల్వంతో జతకట్టాల్సి వచ్చింది.
జయ వాగ్దానాలను నెరవేర్చేందుకు....
ఈనేపథ్యంలో పళనిస్వామి అమ్మ ఆశయాలను నెరవర్చడమే ప్రధమ ప్రాధాన్యంగా ఎంచుకున్నారు. ఎన్నికల సందర్భంగా అప్పట్లో జయలలిత ఇచ్చిన వాగ్దానాలపై చకచకా సంతకాలు చేస్తున్నారు. అమల్లోకి తెస్తున్నారు. ముఖ్యంగా దినకరన్ ను కట్టడి చేసేందుకే పళనిస్వామి దూకుడు పెంచారంటున్నారు. ముఖ్యంగా జయలలిత ఇచ్చిన ప్రధాన హామీ మహిళలకు రాయితీపై ద్విచక్ర వాహనాలుఇచ్చే కార్యక్రమానాకి శ్రీకారం చుట్టారు. అయితే ఈ పథకానికి విపరీతమైన స్పందన లభిస్తోంది. డ్రైవింగ్ లైసెన్సులను పొందేందుకు రవాణా శాఖ కార్యాలయాల్లో మహిళలు క్యూ కడుతున్నారు. ఈ పథకం స్పందనకు ఇదే ఉదాహరణ అని పాలకపక్షం తెగ సంబరపడిపోతోంది.
చిన్నమ్మను దెబ్బతీసేందుకు....
అలాగే దశలవారీగా టస్మాక్ దుకాణాలను మూసివేయిస్తానని కూడా జయలలిత అప్పట్లో హామీ ఇచ్చారు. తమిళనాడులో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తుంది. జయలలిత నిర్ణయం తీసుకున్న తర్వాత 2002లో మిడాన్ అనే సంస్థ ప్రారంభయింది. ఇది తమిళనాడులో ప్రభుత్వం విక్రయించే మద్యం దుకాణాలకు మద్యం సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇందులో శశికళ సన్నిహితులు భాగస్వామ్యులు. శశికళ కుటుంబ సభ్యులకు మిడాన్ సంస్థలో యాభై శాతం వాటా ఉంది. వేల కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని దుకాణాలకు సరఫరా చేస్తుంటుంది. అయితే జయలలిత 2016లో టస్మాక్ దుకాణాలను దశలవారీగా మూసివేయిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు పళనిస్వామి అదే పనిలో ఉన్నారు. గత ఏడాది 500 దుకాణాలను మూసివేయించారు. మరో 500 దుకాణాలను మూసివేయించేందుకు పళనిస్వామి రెడీ అయిపోతున్నారు. ఇలా అమ్మ వాగ్దానాలను నెరవేర్చడంతో పాటుగా దినకరన్ బ్యాచ్ ను దెబ్బతీసేలా పళనిస్వామి వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. వచ్చే స్థానికసంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు పళనిస్వామి జయ వాగ్దానాలను అమలు చేసే పనిలోనే ఉన్నారట.