నేడు డోన్ లో జగన్ ధనాధన్...!

Update: 2017-11-20 00:30 GMT

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర నేటికి 13వ రోజుకు చేరుకుంది. ఈ రోజు సాయంత్రానికి డోన్ నియోజకవర్గంలోకి జగన్ పాదయాత్ర ప్రవేశిస్తుంది. ఇప్పటి వరకూ కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ, బనగానపల్లి నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేసుకున్న జగన్ ఈరోజు డోన్ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాధ్ గెలిచారు. దీంతో వైసీపీ నేతలు జగన్ పాదయాత్రను దిగ్విజయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ జగన్ 160 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన పాదయాత్ర రెండు శుక్రవారాలు మినహా మిగిలిన రోజుల్లో యాత్ర రోజుకు పదమూడు కిలోమీటర్ల మేరకు సాగింది.

నేటి షెడ్యూల్.....

సోమవారం ఉదయం 8.30గంటలకు ఆయన బనగానపల్లె నియోజకవర్గం బాతులూరుపాడుకు చేరుకుంటారు. అక్కడి నుంచి పాదయాత్ర ఎన్నకొండ మీదుగా హుస్సేన్ పురం చేరుకుంటుంది. మహిళా సదస్సులో కూడా జగన్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం హుస్సేన్ పురంలో భోజనానికి ఆగుతారు. తర్వాత పాలకూరు క్రాస్ రోడ్డుకు చేరుకుంటుంది. అక్కడి నుంచి గోవిందదిన్నె కు వచ్చిన జగన్ సాయత్రం 5గంటలకు బేతంచర్ల మండలం గోర్లగుట్ట వద్ద డోన్ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. రాత్రికి గోర్లగుట్టలో జగన్ బస చేస్తారు.

Similar News