‘నారాయణ’ లెక్క తేల్చనున్న తెలంగాణ పోలీసులు

Update: 2017-11-03 08:14 GMT

ఏపీ మంత్రి నారాయణకు తెలంగాణలో చుక్కెదురయింది.నారాయణ కళాశాలల్లో బయటపడిన టేపులు కలకలం రేపుతున్నాయి. నారాయణ కళాశాలల్లో లైంగిక వేధింపులు, అరాచకాలు జరుగుతున్నాయనడానికి ఈ ఆడియో టేపులే నిదర్శనం. ఈ టేపులు ఇప్పుడు తెలంగాణలో సంచలనం కల్గిస్తున్నాయి. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నారాయణ విద్యాసంస్థల సికింద్రాబాద్ డీన్ సతీష్, తార్నాక బ్రాంచ్ ప్రిన్సిపల్ రమేష్ కు పోలీసులు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. అలాగే నారాయణ విద్యాసంస్థల్లో నెంబర్ 2గా వ్యవహరిస్తున్న వెంకటరెడ్డి గెస్ట్ హౌస్ లో జరిగే రాసలీలలు కూడా ఈ టేపుల ద్వారా బయటపడటంతో తెలంగాణ పోలీసులు చర్యలకు దిగారు. నారాయణ క్యాంపస్ ప్రిన్సిపల్ సరితా అగర్వాల్ ను వైస్ ప్రిన్సిపాల్ నవీన్ గౌడ్ వేధిస్తున్నారని ఉప్పల్ పోలీసులు కేసునమోదు చేశారు. అలాగే గతంలో నారాయణ విద్యాసంస్థల ప్రిన్సిపాల్ లలిత ఆత్మహత్య కేసును కూడా పోలీసులు పునర్విచారించనున్నారు. మొత్తం మీద నారాయణకు తెలంగాణలో ఎదురుదెబ్బ తగలనుంది.

Similar News