ప్రేమోన్మాది కార్తిక్, సంధ్య అనే అమ్మాయిపై పెట్రోల్ పోసి తగలబెట్టడం, ఆమె గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడం మనకు తెలిసినదే. ఈ విషయమై కార్తిక్ తల్లి ఊర్మిళ చ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…కొన్ని షాకింగ్ నిజాలను వెల్లడించారు. ‘‘నాకొడుకు చేసింది తప్పే, వాడు ఒకరి ప్రాణాలు తీసే హక్కు లేదు. ఏదైనా సమస్య ఉంటే పెద్దవాళ్ళతో మాట్లాడి, సమస్యని సాల్వ్ చేసుకోవాలి గాని, ఇలా చేయడం చాలా తప్పు. దానికి ఎలాంటి శిక్ష అయినా వెయ్యవచ్చు. వాడు చేసింది తప్పని నేను ఒప్పుకున్నాను కాబట్టె, నేనే పోలీసులకి అప్పజెప్పాను’ అని కార్తీక్ తల్లి అన్నారు. అయితే సంధ్య కుటుంబసభ్యులు చెప్పినట్టు కార్తీక్ కు సంద్యకు అసలు పరిచయం లేదు అనేది అబద్దం. సంధ్యకు, నా కొడుక్కి కొన్నాళ్లుగా పరిచయం ఉందన్నారు.
వాళ్ల బావ చూడటంతోనే...
వీళ్ళిద్దరూ కలసి ఉండగా, సంధ్య వాళ్ళ బావ చూడటం వలన పెద్ద గొడవ జరిగింది. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ కలవడం మానేశారు. కాని, కొద్దిరోజులకే ఆ అమ్మాయే ఫోన్ చేసి బండి తీసుకురమ్మని చెప్పింది. అమ్మాయికి మా అబ్బాయి ఫోన్, బట్టలు అన్నీ కొనిచ్చాడు. ఇంట్లో సరిగ్గా గడవకున్నా సంధ్యకు మాత్రం అన్నీ కొనిచ్చేవాడు. ఇంట్లో గొడవపడి 10వేల రూపాయిలు తీసుకెళ్లి ఆమెకు కొత్త ఫోన్ కొనిచ్చాడు. ఆ ఫోన్ తీసుకుని అమ్మాయి ఇంటికెళ్తే కనీసం ఎక్కడిది ఫోన్ అని తల్లి ఎందుకు అడగలేదు?” అని ఆమె ప్రశ్నించారు. వీళ్ళిద్దరికీ పరిచయం లేదని చెబుతున్నారు కాని, పరిచయం లేకుంటే ఆ అమ్మాయి ఫోన్లో, మా అబ్బాయి ఫోన్లో వాట్సప్ మెసేజ్ లు చూస్తే తెలుస్తుందని ఆమె అన్నారు.
మా ఇంటికి వచ్చేది...
“సంధ్య మా ఇంటికీ వచ్చేది. కొద్దిరోజుల క్రితం నాకు ఫోన్ చేసి కార్తిక్ వేధిస్తున్నాడని చెప్పింది. అయితే మీరిద్దరు పెళ్లి చేసుకుంటారా అని అడిగాను.. లేదు నేను చేసుకోను అంది. అలాంటప్పుడు మా బిడ్డను వదిలేయమని చెప్పాను. అయితే చీటికి మాటికి మావాడికి ఇక ఫోన్ చేయకని ఆ అమ్మాయికి గట్టిగా చెప్పా. కానీ అమ్మాయి మాత్రం పదేపదే ఫోన్ చేసి అక్కడికి రా.. ఇక్కడికి రా పిలిచేది. నా కొడుకు సంపాదన మొత్తం సంధ్యకే ఇచ్చేవాడు. అమ్మాయి కాళ్లకు వేసుకున్న చెప్పులు కూడా కార్తిక్ కొనిచ్చినవే. ఆమెకు ఏం కావాలన్న ఫోన్ చేసేది అబ్బాయి వెళ్లి కొనిచ్చేవాడు” నా కొడుకుని పిచ్చోడ్ని చేసింది అని ఊర్మిళ చెప్పారు.
ఒకసారి ఫోన్ పాడయిపోతే...
ఒకసారి అమ్మాయి ఫోన్ పాడైందని మా అబ్బాయికి ఫోన్ చేసింది.. తీనే అన్నం పక్కనపెట్టి అమ్మాయి కోసం వెళ్లాడు. ఫోన్ రిపైర్ చేయించగా ఫోన్లో మెసేజ్‌లు చూసి మా అబ్బాయి తిట్టాడు. మా సార్ నన్ను టార్చర్ పెడుతున్నాడని అమ్మాయి చెప్పడంతో అక్కడి మాన్పించి మరోచోట జాబ్‌లో జాయిన్ చేయించాడు. ఈ విషయాలన్నీ సంధ్య వాళ్లింట్లో ఎవరికీ తెలియదు. మా అబ్బాయి ఇంత మూర్ఖంగా, కఠినంగా తయారవ్వడానికి అమ్మాయే కారణం. తప్పు ఇద్దరిదీ ఉందా? ఒకరిదే ఉందా? అనేది చూసి న్యాయంగా శిక్ష వేయాలి” అని ఆమె ప్రాధేయపడుతున్నారు.
ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్...
ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసేది. వీడియో కాల్స్, చాటింగ్ చేసేది. మా అబ్బాయితో మాట్లాడుతూ వేరొకరితో కూడా అమ్మాయి మాట్లాడుతుండేది.. వీడు ఫోన్ చేసినా ఆమె పక్కనపెట్టి వేరే వాళ్లతో మాట్లాడేది. ఏదో సర్దుకుంటారు కదా అనుకున్నా అయితే ఇంత దారుణానికి పాల్పడతాడని అనుకోలేదు. ఇలా చేయడం తప్పే. నువ్వు నాకు వస్తువులన్నీ కొనిచ్చావని మా సార్‌కు చెప్పావ్ కదా.. నీవన్నీ ఇచ్చేస్తా ఎక్కడికి రమ్మంటావ్ చెప్పు అని శుక్రవారం ఉదయం అమ్మాయి కార్తిక్‌కు ఫోన్ చేసింది. కానీ ఇంతలోనే ఇలా ఘోరం జరిగిపోయింది” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రేమ పేరుతో ఆడపిల్లలు, మగపిల్లలు చదువులు కెరియర్ అన్నీ వదిలేసి, ఇలాంది సమస్యలను వాళ్ళు తెచ్చుకోవడమే కాకుండా, ఇంట్లో వాళ్లకు కూడా తెస్తున్నారు. ఇలాంటి వార్తలు చూసి అయినా, యువత కొంత జాగ్రత్తగా నడుచుకుంటే మంచిదని కార్తీక్ తల్లి ఊర్మిళ అన్నారు.