నమస్తే..... నిర్మల వీడియో వైరల్

Update: 2017-10-09 16:30 GMT

చైనా సైనికులతో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ముచ్చట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సిక్కిం సరిహద్దుల్లోని డోక్లామ్ నాథులా బోర్డర్ ను మంత్రి నిర్మలాసీతారామన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె చైనా సైనికులకు నమస్కరించారు. వారు కూడా ప్రతి నమస్కారం చేశారు. అయితే ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ నమస్తే అంటే అర్ధం ఏంటో తెలుసా? అని ప్రశ్నించారు. కాని వారు దానికి సరైన సమాధానం ఇవ్వలేదు. భారత సైనికులు చెప్పబోతుండగా మంత్రి వారించి వారినే చెప్పనీయండంటూ నవ్వతూ అన్నారు.

చైనా సైనికులతో మాటా మంతీ.....

అయితే చైనా సైనికుడు ఒకరు నమస్తే అన్న పదానికి అర్ధం చెప్పారు. మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉందని అర్ధం అని చెప్పారు. అలాగే నమస్తే ని చైనా భాషలో ఏమంటారో కూడా నిర్మల వారిని అడిగి తెలుసుకున్నారు. నిహావ్ అంటారని చైనా సైనికులు సమాధానమిచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిర్మలా సీతారామన్ ఇటీవల దేశ సరిహద్దుల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

Similar News