మధురమైన అనుభూతులను మిగుల్చుకునే రోజు చావుకి దగ్గరగా నవ వధువును తీసుకువెళ్లిన మొగుడి బండారాన్ని బయట పెట్టేశారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృస్టించిన చిత్తూరు జిల్లా చినదామరగుంట లో కొత్తపెళ్ళికొడుకు శోభనం రోజు చేసిన నిర్వాకం అందరికి తెలిసిందే. వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడు గా పనిచేస్తున్న రాజేష్ శైలజ అనే యువతిని కాణిపాకం లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి అయిన తరువాత తాను సంసారానికి పనికి రానని ఎవరికి చెప్పొద్దని భార్య శైలజాకి రాజేష్ చెప్పాడు. కానీ ఆమె ఆ విషయం తల్లితండ్రులకు చెప్పేసింది. వారు నిలదీయడంతో అటువంటిది ఏమి లేదని నమ్మబలికి అత్తవారింట శోభనానికి రెడీ అయ్యాడు రాజేష్. తాను చెప్పొద్దని చెప్పినా శైలజ అందరికి చెప్పడంతో ఆగ్రహించి భార్యపై పైశాచికంగా దాడికి పాల్పడ్డాడు రాజేష్. ఆమె చావు బతుకుల మధ్య తప్పించుకుని బయటపడి తిరుపతి స్విమ్స్ లో చికిత్స పొందుతుంది.
అసలు విషయం అదే ...
రాజేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు విచారించారు. తన భార్య తన వారిని అవమానించడం వల్లే కోపంతో దాడి చేసినట్లు తొలుత శాడిస్ట్ భర్త బుకాయించాడు. రాజేష్ బంధువులు అతగాడి దాష్టికాన్ని సమర్ధించారు. ఇక లాభం లేదని ఖాకీలు లైంగిక సామర్ధ్య పరీక్షకు సిద్ధం కావాలని కటువుగా చెప్పడంతో రాజేష్ ఆందోళనతో అసలు విషయం బయటపెట్టేశాడు. తనకు సెక్స్ సామర్ధ్యం లేదని అంగీకరించాడు. దాంతో పోలీసులు రాజేష్ ను అతడి తండ్రి పై కూడా మోసం చేసి పెళ్లి చేసుకున్నారనే ఆరోపణలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి శాడిస్ట్ రాజేష్ ని ఉపాధ్యాయ వృత్తినుంచి సస్పెండ్ చేశారు. తీవ్ర గాయాలతో తిరుపతిలో చికిత్స పొందుతున్న నవ వధువు శైలజను రాష్ట్ర మహిళా కమిటీ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి పరాపర్శించి అన్ని విధాలా ఆదుకుంటామని హామీనిచ్చారు.