‘‘నన్ను చంపేందుకు కుట్ర’’

Update: 2018-01-27 10:57 GMT

తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తనకేమైనా జరిగితే తెలంగాణ రాష్ట్ర సమితి బాధ్యత వహించాల్సి ఉంటుందని కోమటిరెడ్డి చెప్పారు. కోమటిరెడ్డి అనుచరుడు ఇటీవల నల్లగొండలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తనను కూడా చంపేందుకు కుట్ర జరుగుతుందన్నారు. ఈ మేరకు డీజీపీకి లేఖ రాశారు. తనకు భద్రత పెంచాలని లేఖలో కోరారు. తనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు, 4 ప్లస్ 4 గన్ మెన్లను ఇవ్వాలని వెంకటరెడ్డి కోరారు.

Similar News