ధోని బి గ్రేడ్ లోకి వచ్చేస్తాడా ...?

Update: 2018-03-01 02:30 GMT

భారత క్రికెటర్లకు బిసిసిఐ కొత్త కాంట్రాక్ట్ అమలు చేయబోతుంది. ఎప్లస్ ఏ బి సి గ్రేడ్ లుగా క్రికెటర్లను విభజించి వారికి నూతన కాంట్రాక్ట్ ప్రకారం చెల్లింపులు చేపట్టనుంది. గత 12 ఏళ్ళుగా ఎ గ్రేడ్ లో కొనసాగుతున్న ధోని ఇప్పుడు నూతన విధానం ప్రకారం బి గ్రేడ్ కి పడిపోనున్నాడు. కారణం ఏమిటంటే ఎప్లస్, ఏగ్రేడ్ క్రీడాకారులుగా కాంట్రాక్ట్ కుదరాలంటే వారు టెస్ట్, వన్డే, టీట్వంటీ మ్యాచ్ లను మూడు ఫార్మేట్ లలో ఆడాలిసివుంది. ఇప్పటికే టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై కొట్టేశాడు ఎంఎస్ ధోని. వన్డే , టీట్వంటీలకే పరిమితం అయ్యాడు ధోని. ఇలాంటి పరిస్థితిలో ధోని బి గ్రేడ్ కి పడిపోతాడని క్రీడా విశ్లేషకుల అభిప్రాయం.

కోటి తగ్గుతుందా?

బిసిసిఐ కొత్త నిబంధనల ప్రకారం ఏగ్రేడ్ క్రికెటర్లకు రెండుకోట్ల రూపాయలను అందిస్తారు. బి గ్రేడ్ కి కోటిరూపాయలు అందుకుంటారు. సి గ్రేడ్ క్రికెటర్లకు 50 లక్షలరూపాయలు బిసిసిఐ అందిస్తుంది. ఈ కొత్త నిబంధలను రూపొందించింది సెలక్షన్ కమిటీ ఛైర్మెన్ ఎమ్మెస్కే ప్రసాద్ కావడం విశేషం. ఈసారి దేశవాళీ లో రాణించే క్రికెటర్లకు కాంట్రాక్ట్ అమలు చేయాలని సంస్థ భావిస్తుందని బిసిసిఐ వర్గాల భోగట్టా.

Similar News