దీదీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ

Update: 2017-10-30 16:30 GMT

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డును తప్పనిసరి చేయడంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయతే దీనిపై ఈరోజు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు దీనిపై సీరియస్ అయింది. ఒక కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను రాష్ట్ర్ర ప్రభుత్వం ఎలా సవాల్ చేస్తుందంటూ ప్రశ్నించింది. మమత బెనర్జీ వ్యక్తిగతంగా పిటిషన్ వేస్తే సరేగాని, ఇలా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే సెల్ ఫోన్లకు ఆధార్ కార్డుకు లింక్ పెట్టే విషయంపై విచారణకు సుప్రీం స్వీకరించింది.

వ్యక్తిగతంగా పిటిషన్ వేస్తే.....

మమత బెనర్జీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అనేక ఆందోళనలు చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు విషయంలోనూ మమత మోడీ నిర్ణయాన్ని తీవ్రంగానే తప్పుపట్టారు. పశ్చిమ బెంగాల్ కేంద్ర ప్రభుత్వ బలగాల మొహరింపుపైనా ఆమె మోడీపై చిందులు తొక్కారు. తాజాగా ఆధార్ అనుసంధానంపై మమత సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తన మొబైల్ కనెక్షన్ తీసేసినా సరే తాను మాత్రం ఆధార్ కార్డుతో అనుసంధానం చేయబోనని మమత తేల్చి చెప్పారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కాకుండా, మమత వ్యక్తిగతంగా పిటిషన్ వేసుంటే తాము పరిశీలించేవారమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం విశేషం.

Similar News