దక్షిణాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ లు ఆడుతున్న ఆసీస్ క్రీడాకారులు తలవంచుకునే పని చేసి విమర్శల పాలయ్యారు. ఇక దక్షిణాఫ్రికాతో పరాజయం అంచున వున్న టీం ను గెలిపించేందుకు బాల్ ట్యాపరింగ్ చేస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయి తలదించుకున్నారు. కేప్ టౌన్ టెస్ట్ లో జరిగిన ఈ సంఘటన పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు కూడా సీరియస్ అయ్యింది. ఐసిసి నిబంధనల ప్రకారం మ్యాచ్ ఫీజు లో కెప్టెన్ స్టీవ్ స్మిత్ కి 100 శాతం రద్దు చేసి ఒక మ్యాచ్ నిషేధం విధించారు. బెన్ 75 శాతం ఫీజు కోసేశారు. ఇక చేసిన తప్పుడు పనికి డేవిడ్ వార్నర్ స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. కేప్ టౌన్ టెస్ట్ లో దక్షిణాఫ్రికా 322 పరుగుల తేడాతో ఆసీస్ ను మట్టికరిపించి తన సత్తా చాటిచెప్పింది. ఓటమినుంచి బయటపడేందుకు ఆసీస్ బాల్ ఆకారాన్ని మార్చే ప్రయత్నం చేసినా పరాజయం తప్పించుకోలేదు సరికదా అభాసుపాలైంది.
విలువలు కోల్పోతూ ...
జంటిల్మెన్ గేమ్ లో ఆస్ట్రేలియా అంటే సింహస్వప్నం. అది ఒకప్పటి మాట. ఇప్పుడు ప్రపంచ క్రికెట్ లో ఇండియా, సౌత్ ఆఫ్రికా, న్యూ జిలాండ్, పాకిస్తాన్, వెస్ట్ ఇండీస్ ,ఇంగ్లాండ్ శ్రీలంక లు సైతం ఆసీస్ ను అలవోకగా మట్టి కరిపించే టీం లు. అలెన్ బోర్డర్, స్టీవ్ వా, రిక్కీ పాంటింగ్ వంటి ప్రపంచ దిగ్గజ కెప్టెన్లతో విలువలకు పట్టం కట్టిన ఆస్ట్రేలియా ఇప్పుడు ఎలాగైనా గెలవాలని పరువు పోగొట్టుకుంది. డాన్ బ్రాడ్ మెన్ వారసుల వీరు అని అంతా ముక్కున వేలేసుకుని పరిస్థితి వచ్చింది.
ప్రపంచ క్రికెట్ లో పెను వివాదమే....
యాసిస్ సిరీస్ లో బాడిలైన్ బౌలింగ్ ప్రపంచ క్రికెట్ లో పెను వివాదమే అయ్యింది. ఆ తరువాత ఇప్పటికి ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేస్తూ అవతలి వారిని గెలిచేస్తూ వారి ఏకాగ్రతను దెబ్బతీసే ఫార్ములా వాడుతూ వుంటారు. అయితే మానసికంగా దృఢంగా ఉండటం కూడా ఆటలో భాగమే కావడం వల్ల ప్రత్యర్థులపై ఒక మోస్తరు తిట్లను ఐసిసి అనుమతిస్తుంది. ఆస్ట్రేలియన్ ఆటగాళ్లలో ఆల్ టైం గ్రేట్ సర్ బ్రాడ్ మెన్ ఆయన నిజమైన వారసులుగా ప్రపంచ క్రికెట్ అభిమానుల మనసు దోచిన వారు బోర్డర్, స్టీవ్ వా అనే చెప్పాలి. అలాంటి వారు నెలకొల్పిన ప్రమాణాలను ప్రపంచ దిగ్గజ టీం విస్మరించడం క్రికెట్ లో వస్తున్న అవాంఛనీయ పరిణామాలను చాటి చెబుతూ క్రీడాభిమానుల హృదయాలకు గాయం చేస్తుంది.