దమ్మరే... దమ్... ముంబయి తరలిపోతుందే...!

Update: 2017-12-05 19:30 GMT

గంజాయి కి ఏజెన్సీ ప్రాంతం అడ్డాగా మారింది. ఏజెన్సీ ప్రాంతంలో విస్తృతంగా పండుతున్నగంజాయి ఇప్పడు దేశ వ్యాప్తంగా బాగా ఫేమస్.. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయిని పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. ముంబాయ్ కి పెద్ద ఎత్తున్న తరలిస్తున్న ఈ గంజాయి ని హైదరాబాద్ మీదకు స్మగ్లింగ్ చేస్తున్నారు. గంజాయి స్మగ్లింగ్ కు ఇప్పడు తెలుగు రాష్ట్రాలు కేరాఫ్ ఆడ్రస్ గా మారాయి. డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఈమధ్య కాలంలో చాల చురుగ్గా పనిచేస్తున్నారు. అక్రమంగా మన రాష్ట్రాల నుంచి తరలి వెళ్లుతున్న గంజాయి ని ఎప్పటికప్పడు పట్టుకుంటున్నారు. అంతేగాకుండా ఏజెన్సీ టూ ముంబయ్ వయా హైదరాబాద్ వెళ్లుతున్నా గంజాయి స్మగ్లింగ్ ను అడ్డుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కొత్త కొత్త పద్దతిల్లో ఇప్పడు గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంది. ఈ స్మగ్లింగ్ ను చూసి పోలీసులు సయితం విస్తుపొతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని లారీల్లో ఈ గంజాయి తరలిస్తున్నారు. ప్రధానంగా ఈ గంజాయిని లారీల్లో సీక్రెట్ గదులను ఏర్పాటు చేసి వాటి ద్వారా గంజాయిని తీసుకుని వస్తున్నారు. ఈ సీక్రెట్ గదులను గుర్తించడం కూడా పోలీసులకు కష్టమే. బయట నుంచి చూసిన వారికి అందులో గంజాయి వుందన్న ఆనావాళ్లు కూడా కనబడవు.

పోలీసుల కన్నుగప్పి....

పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం గంజాయి తరలింపు మాత్రం తగ్గటంలేదు. తనిఖీల్లో రోజూ ఏదో ఒక చోట కిలోల కొద్ది గంజాయి స్వాధీనం చేసుకుంటున్నారు. అయినా రవాణా దారులు మాత్రం వెనకడుగు వేయడంలేదు. తాజాగా తెలంగాణలోని మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో రూ.35 లక్షల విలువ చేసే 292 కిలోల గంజాయి పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ముగ్గుర్ని అరెస్ట్ చేయడంతో పాటు మూడు కార్లు సీజ్ చేశారు. అటు ఏపీలో కూడా భారీగా గంజాయిని పట్టుకున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోలో తరలిస్తున్న 600 కేజీల గంజాయిని గుర్తించారు. దీని విలువ సుమారు రూ. 60 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గత రెండు రొజుల్లో డిఅర్ఐ మూడు వేల కిలోల గంజాయిని అధికారులు స్వాధీన పరుచుకున్నారు. పెద్ద మొత్తంలో ముంబాయికి తరలి వేళ్లుతున్న గంజాయిని కట్టడ చేసేందుకు ప్రయత్నాలు చేస్తునే ఉన్నామంటున్నారు అధికారులు.

Similar News