భూమి వేగంలో వచ్చిన మార్పుతో వచ్చే ఏడాదిలో అత్యధిక భూకంపాలు సంభవిస్తాయన్న భౌతిక శాస్త్ర నిపుణుల హెచ్చరికలు ప్రపంచ పౌరులను ఇప్పటినుంచి వణికిస్తున్నాయి. ముఖ్యంగా న్యూజిలాండ్ అత్యధికంగా భూకంపాల తీవ్రత చవిచూస్తుందన్న నిపుణుల హెచ్చరికలు ఆ దేశ వాసులను కలవరపెడుతున్నాయి. ఒక్క భూకంపాలు మాత్రమే కాదు అవి ఏర్పడటం వల్ల వచ్చే సునామీలు తుడిచిపెట్టేస్తాయని హెచ్చరిస్తున్నారు. సునామీలు విరుచుకు పడే ముందు పౌరులు తమను తాము రక్షించుకోవడానికి కేవలం ఏడు నిమిషాలే వ్యవధి ఉంటుందని అంటున్నారు. భౌగోళిక శాస్త్రవేత్తలు చెబుతున్న లెక్కలతో ప్రశాంతంగా వుండే అందమైన న్యూజిలాండ్ దేశాన్ని ఆందోళనకు గురిచేస్తుంది.
న్యూజిలాండ్ సమీప పీఠం లో ప్రకంపనాలు అంచనాలు వేసి ...
భవిష్యత్తు లో వచ్చే భూకంపాలు అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు న్యూజిలాండ్ సమీపంలో భూమి అడుగుభాగంలో వున్న పీఠం లో వస్తున్న ప్రకంపనలు పెను విపత్తును ముందుగా హెచ్చరిస్తున్నాయంటున్నారు. 2017 లో 15 నుంచి 20 భూకంపాలు ప్రపంచ వ్యాప్తంగా వస్తే 2018 లో 25 నుంచి 30 వరకు అతి భారీ ప్రకంపనలతో కూడిన భూకంపాలు నమోదు అవుతాయని చెబుతున్న మాటలు హడలెత్తేలా చేస్తున్నాయి. ఈ ప్రకృతి విపత్తునుంచి ఎలా బయట పడాలి అనే ఆలోచనలో అక్కడి వున్నవారు భయం గుప్పిట్లో బిక్కు బిక్కు మంటున్నారు. ఈ ఏడాది జపాన్ లోను న్యూజిలాండ్ లో సంభవించిన భూకంపాలు సృష్ట్టించిన వినాశనం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆ దేశాలు రాబోయే విపత్తులను ఎదుర్కొనే కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. మొత్తానికి కొత్త ఏడాది ప్రారంభం కాకుండానే అందరిని హడలెత్తించడం విశేషం.