తెలుగులో అదరగొట్టిన మోడీ

Update: 2017-11-28 08:22 GMT

‘సొదరీ సోదరీ మణులారా... మీ అందరికీ శుభాకాంక్షలు. హైదరాబాద్ అంటే నాకుఇష్టం. హైదరాబాద్ అంటే సర్దార్ పటేల్ గుర్తుకు వస్తాడు. హైదరాబాద్ కు రావడం ఆనందంగా ఉంది. తెలంగాణ ప్రజలు నాకు అన్నదమ్ములు లాంటి వారు. తెలంగాణ అమరవీరులకు జోహార్లు.’ అని ప్రధాని మోడీ తెలుగులో మట్లాడారు. దాదాపు ఒకటన్నర నిమిషంపాటు తెలుగులోనే ప్రసంగించడం విశేషం. బీజేపీ నేతలతో జరిగిన సమావేశంలో మోడీ ప్రసంగించారు. ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తుందన్నారు. ప్రపంచ దేశాల నుంచి హైదరాబాద్ కు పారిశ్రామికవేత్తలు వచ్చారన్నారు. ఆ తర్వాత హిందీలో తన ప్రసంగాన్ని కొనసాగించారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రాలపై ఎటువంటి బేధాలను చూపడం లేదన్నారు. అందరికీ సమాన న్యాయం అందించాలన్నదే తమ ధ్యేయమన్నారు. ఏ రాష్ట్రానికైనా కేంద్రం మద్దతుగా నిలుస్తుందన్నారు. కేవలం పది నిమిషాలు మాత్రమే ప్రసంగించారు.

Similar News