భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. టేకులపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులకు, చండ్రపుల్లారెడ్డి బాట దళానికి మధ్య జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మరణించారు. టేకులపల్లి అటవీల ప్రాంతంలో కొందరు నక్సల్స్ సమావేశమయ్యారన్న సమాచారంతో టేకులపల్లి గ్రేహౌండ్స్ దళాలతో పాటు పోలీసులు కూంబింగ్ నిర్వహించాయి. దీంతో పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. తాము ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపామని పోలీసులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. గుండాల, ఇల్లందు, టేకుల పల్లి, బోడు పోలీస్ స్టేషన్లలో వీరందరిపై పలు కేసులు నమోదయి ఉన్నట్లు తెలిసింది.