కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పెంపు ఖాయమని చెప్పారు. తన వద్ద ఖచ్చితమైన సమాచారం ఉందని చెప్పారు. అందుకోసం టిక్కెట్ల ఆందోళన ఎవరూ చెందవద్దని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రంపై వత్తిడి పెంచుతున్నామని, నియోజకవర్గాల పెంపు ఖాయమని చెప్పారు. అంతేకాకుండా టిక్కెట్ల కోసం ఎవరూ తెలంగాణ భవన్ కు రావడానికి వీల్లేదని కేసీఆర్ ఆదేశించారు. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయిస్తామని తెలిపారు. టిక్కెట్లు రాని వారికి అన్యాయం మాత్రం చేయబోనని, వారికి సముచితమైన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈసారి సర్వేలో కూడా తమకు అనుకూలంగానే ఫలితాలు వచ్చాయన్నారు. 95 నుంచి 105 స్థానాలను ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని చెప్పారు.
మూడు నెలల ముందే అభ్యర్థుల ఖరారు.....
ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థులను ఖరారు చేస్తామని కేసీఆర్ చెప్పారు. మూడునెలల ముందు అభ్యర్థులు ఖరారు చేస్తే ఎన్నో అడ్వాంటేజీలు ఉన్నాయన్నారు. అలాగే తాను ఎన్నిలకు ముందు జరిపిన సర్వేలో ఎవరికి ఎడ్జ్ ఉందని తేలితే వారికే టిక్కెట్లు కేటాయిస్తామని కేసీఆర్ తెలిపారు. అందుకనేఈ ఏడాది ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలన్నారు. ఎమ్మెల్యే పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేసీఆర్ పనితీరు మెరుగుపర్చుకోకుంటే తర్వాత బాధపడినా ప్రయోజనం లేదని హెచ్చరించారు. మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఖాయమని కేసీఆర్ ఆత్మవిశ్వాసం వ్యక్తంచేశారు. అలాగే టీఆర్ఎస్ కార్యవర్గ సభ్యులకు నియోజకవర్గాల బాధ్యతలను కూడా అప్పగించిన కేసీఆర్, కార్యకర్తల శిక్షణ తరగతులను నిర్వహించే సమన్వయ కర్తగా సంతోష్ ను నియమించారు. దీంతో తన బంధువైన సంతోష్ ను కేసీఆర్ నేరుగా రంగంలోకి దింపారు. కేసీఆర్ నియోజకవర్గాల పెంపు జరగనుందని కేసీఆర్ చెప్పటంతో ఎమ్మెల్యేల్లో జోష్ నెలకొంది.