తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది . వైసిపి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు , మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన రావు తనయుడు జక్కంపూడి రాజా పై రాంగ్ పార్కింగ్ పేరుతో పోలీస్ లు ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. భార్యతో తన అత్తగారి ఇల్లు ద్రాక్షారామానికి వెళుతున్న రాజా రోడ్డుపై కారు ఆపిన సందర్భంలో వివాదం చోటు చేసుకుంది. ఒక కానిస్టేబుల్ రాజా తో వాగ్వాదానికి దిగారు. అటుగా వెళుతున్న ఎస్ ఐ ఆ సమయంలో రాజా పై దాడికి పాల్పడటం ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ కావడంతో పోలీస్ స్టేషన్ ముందు వైసిపి నేతలు కాపు నేతలు ధర్నాకు దిగారు.
దగ్ధమైన టెంట్ ... రంగంలోకి తోట త్రిమూర్తులు ....
చిలికి చిలికి గాలివానగా వ్యవహారం ముదిరిపోవడంతో విషయం తెలుసుకున్న రామచంద్రపురం ఎమ్యెల్యే తోట త్రిమూర్తులు రంగంలోకి దిగారు. ఇటు పోలీసులు అటు జక్కంపూడి రాజా తో చర్చలు మొదలు పెట్టారు. ఇరువర్గాలు పట్టుదలకు పోకుండా నివారించారు. స్టేషన్ లో చర్చలు , స్టేషన్ బయట వైసిపి ఆందోళన సాగుతుండగానే అక్కడ ఒక టెంట్ ను ఆందోళన కారులు కొందరు దగ్ధం చేశారు. మరోవైపు భారీ ఎత్తున పోలీస్ బలగాలు, ఇంకోవైపు జిల్లా వ్యాప్తంగా కాపునేతలు, వైసిపి శ్రేణులు అక్కడికి చేరుకుంటూ ఉండటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తం గా మారింది.