తల్లి కావాలని అనుకుంది. కాని శరీరం సహకరించలేదు. వివాహం జరిగిన మూడునెలలకే గర్బం పోయింది. నాలుగునెలల క్రితం మళ్లీ గర్భం పోయింది. తల్లి అయ్యే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. తల్లి కాకపొతే భర్త తనకు దూరం అవుతాడని బాధ.. ఎమీ పాలు పోక తొమ్మిది నెలలు గర్భవతిగా నాటకం ఆడింది..చివరకు డెలీవరీ కోసం ఆసుపత్రికి వెళుతానని వెళ్లింది. పాతబస్తీ ఆసుపత్రికి వచ్చి..మరొక లేడీ డెలివరీ చేసిన బాబును ఎత్తుకునిపోయి తన బిడ్డగా కుటుంబ సభ్యులకు చెప్పింది. కోడలు చెప్పిన మాటలు నమ్మి పండగ చేసుకున్నారు. అంతలోనే కొన్ని గంటల్లోనే బిడ్డా చనిపోయాడు.. కుటుంబం మొత్తం కూడా శోక సముద్రంలో మునిగిపొయి అంత్యక్రియలు చేసేశారు. కాని మూడు రోజుల తరువాత గాని అసలు విషయం తెలియరాలేదు. తమ ఇంటికి తెచ్చిన బిడ్డను ఆసుపత్రిలో కిడ్నాప్ చేసి తీసుకుని వచ్చిందన్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.
పిల్లలు పుట్టకపోవడంతో.....
వరంగల్ జిల్లా కేసముద్రంకు చెందిన మంజుల కుటుంబం బతుకు దెరువు కోసం హైదరబాద్ వచ్చి కాటేదాన్ ప్రాంతంలో నివాసం వుంటున్నారు. ఇక్కడే ఒక ఫ్యాకర్టీలో పనిచేసుకుంటు వుండగా..మహాబూబ్ నగర్ కు చెందిన కూమార్ తో పరిచయం ఏర్పడింది. మూడేళ్ల క్రితం వీరు వివాహం చేసుకున్నారు. పెండ్లి చేసుకున్న నాలుగు నెలలకే గర్భస్రావం అయింది. మంజులకు. అప్పటి నుంచి పిల్లల కోసం పరితప్తిసునే వున్నారు ఈ దంపతులు. అయితే తొమ్మిది నెలల క్రితం తాను గర్భవతి అని తన భర్త కూమార్ కు మంజుల చెప్పింది. ఐదునెలలకే మళ్లీ గర్భస్రావం అయ్యింది. అయితే ఈ విషయాన్ని భర్తకు చెప్పలేదు మంజుల... తాను గర్బవతిగానే నటిస్తూ వచ్చింది. నెల నెల డాక్టర్ చెకప్ అంటూ వెళ్లి వస్తు వుండేది. శనివారం రోజు తాను డెలివరీకికోసం ఆసుపత్రికి వెళ్లుతానని చెప్పింది. శనివారం సాయంత్రం పాతబస్తీలోని మెటర్నిటి ఆసుపత్రికి మంజుల వచ్చింది. ఎవరైనా బిడ్డను అమ్ముతారా అని వాకబు చెసింది. మెటర్నిటి వార్డుకు పోయి ఎంక్వైరీ కూడా చెసింది. అయితే ఎవరూ అందుకు సిద్దంగా లేక పొవడంతో శనివారం రాత్రి ఆసుప్రతిలోనే పడుకుంది. ఉదయం సమయంలో మళ్లీ మెటర్నిటి ఆసుపత్రికి వెళ్లింది. అదే సమయంలో నిర్మల తల్లి కల్నన సిస్టర్స్ రూమ్ దగ్గర వుంది. ఇక్కడ సిస్టర్స్ ఎవరు లేరా అని మంజులను అడిగింది. ఏమి కావాలన్నా తాను హెల్ప్ చేస్తానని నమ్మబలికింది. ఒక్క గంట పాటుగా కల్పనతో పిచ్చాపాటి వేసి పిల్లాడికి సంబంధించి అన్ని విషయలను తెలుసుకుంది. తాను ఒక నర్సు అన్న భావనను కల్పించింది. మరొక వైపు నిర్మల కుటుంబ సభ్యురాలుగా కూడా ఆసుపత్రి వర్గాలను కూడా నమ్మించింది. పిసికందు కు బాగాలేదని వెంటనే నిలోఫర్ ఆసుపత్రికి తీసుకుని పొవాలని చెప్పారు వైద్యులు. దీంతో కల్పనతో పాటుగా మంజుల కూడా కేర్ టేకర్ గా సంతకాలు తీసుకుని ఆసుపత్రి వర్గాలు కల్పనకు అప్పగించడం జరిగింది. ఇద్దరు కలిసి నీలొఫర్ వచ్చి పసికందుకు ట్రీట్ మెంట్ చేయించి బయటికి తీసుకుని వచ్చే సమయంలో అదను చూసి బాబును తీసుకుని మంజుల అక్కడి నుంచి ఉడాయించింది. నిలోఫర్ ఆసుపత్రి నుంచి నేరుగా మంజుల ఆటోలో సంధ్య హొటల్ వరకు వచ్చింది. అక్కడి నుంచి బస్సులో ఆఫ్జల్ గంజ్ వరకు వచ్చింది.అక్కడి ఒక మరొక బస్సులో పాతబస్తీ ఆసుపత్రికి వచ్చింది. అయితే అంతకంటే ముందే తన భర్తకు కాల్ చేసి తాను డిశ్చార్జి అవుతున్నాను .ఫలానా టైమ్ కు రావాలని చెప్పింది. దీంతొ అదే టైమ్ కు భర్త కుమార్ ఆసుపత్రికి వచ్చాడు. అప్పటికే మంజుల గేట్ దగ్గర వెయి్ చేస్తూ ఉంది. వెంటనే బాబును తీసుకుని తన వాహనం మీద గ్రామానికి బయలు దేరారు. అయితే సిటి బయటకు వెళ్లగానే మోటార్ సైకిల్ చేడిపొయింది. దీంతో ఆర్టీసీ బస్సులో సొంత గ్రామానికి వెళ్లారు. ఇంటికి పోయిన రాత్రికి పసికందు చనిపొయాడు. ఉదరం బాగా ఉబ్బి పొయి మృత్యు వాత పడ్డాడు. చనిపొయిన పసికందుకు రాత్రి సమయంలోనే అంత్యక్రియలు చేసి తిరిగి కాటేదాన్ వచ్చిందిమంజుల.
విషాదం మిగిల్చిన కిడ్నాప్....
అయితే కిడ్నాప్ కేసును ఛేదించేందుకు పోలీసుల సాంకేతికతతో పాటుగా మ్యాన్ వల్ పోలీసులు నమ్మారు. మంజుల వెళ్లిన అన్ని రూట్స్ లో కూడా పోలీసులు సిసిటివీలను పరిశీలించారు.అయినా ప్రయోజనం లేకుండా పోయింది.అయితే మంజుల ఎక్కి వెళ్లిన ఆటో ఆధారంగా పోలీసులకు మంజుల చిక్కింది. అయితే తాను తల్లి కావాలన్న కోరికతోనే తాను బిడ్డను తీసుకుని పొయానని చెప్పింది. నాలుగు రోజుల పసికందు కిడ్నాప్ వ్యవహారం చివరకు విషాదం గా మిగిలింది. ఏది ఎమైన బాబు ఆచూకీ కనుగొనేందుకు పోలీసుల చేసిన శ్రమ మొత్తం వృధా అయిందని చెప్పుకోవాలి.