ప్రమాదాలు జరిగినప్పుడు వాటిపై నియమించే విచారణ కమిటీలు ఇచ్చే నివేదికలు కామెడీగా ఉంటాయి. అలాంటి నివేదికే ముంబాయి ఎల్ఫీన్ స్టోన్ రైల్వే స్టేషన్ లో ఇటీవల చోటు చేసుకున్న తొక్కిసలాటపై ప్రభుత్వం నియమించిన విచారణ సంఘం ఇచ్చింది. అనేకమంది ప్రయాణికులు పిట్టల్లా రాలిపోయిన ఈ ఘటన దేశవాసులను తీవ్ర కలవరానికి గురిచేసింది. రైల్వే శాఖ నిర్లక్ష్య వైఖరిని అంతా తూర్పారబట్టారు . ఇంత జరిగినా విచారణ సంఘం మాత్రం రైల్వే శాఖను తన విచారణలో తప్పులేదని తేల్చి విమర్శల పాలైంది.
అంతా భారీ వర్షం చేసింది ...
రైల్వే స్టేషన్ లో సాగిన ఈ దుర్ఘటనకు ప్రధాన కారణం వర్షం వల్ల చోటుచేసుకుందని విచారణ సంఘం తేల్చింది. ప్రమాదానికి ముందు కురిసిన భారీ వర్షంతో ప్రయాణికులు బ్రిడ్జ్ పైకి భారీ లగేజ్ తో చేరుకున్నారని . అలా లగేజ్ తో పరిగెత్తుతూ కొందరు పడిపోవడంతో తొక్కిసలాట జరిగిందని పేర్కొంది. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కానీ రైల్వే శాఖ నిర్లక్ష్యం ఏ మాత్రం కాదని విచారణ నివేదిక తేల్చేసింది. భవిష్యత్తులో ప్రయాణికులు తక్కువ లగేజ్ తో ప్రయాణించాలంటూ సూచనలు చేసింది. అవసరమైతే ఆ రైల్వే స్టేషన్ లో మరో బ్రిడ్జ్ నిర్మించాలని సన్నాయి నొక్కులు నొక్కింది. ఇప్పుడు విచారణ సంఘం ఇచ్చిన నివేదిక ముంబాయి లో పెను దుమారమే సృష్ట్టించనుంది