తప్ప తాగి సినీనటుడు ఏం చేశాడంటే...?

Update: 2017-12-03 04:32 GMT

తప్పతాగి కారు డ్రైవ్ చేస్తూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో పోలీసులకు చిక్కాడు సినీ హాస్య నటుడు నవీన్.. మద్యం తాగిన మైకంలో కారు స్టీరింగ్ పట్టిన నటుడు నవీన్ మీడియాను చూసి పారిపోతూ.. ఓ కారు కింద నక్కాడు.. నవీన్ పై కేసు బుక్ చేసిన ట్రాఫిక్ పోలీసులు అతని కారును సీజ్ చేశారు. పబ్బుల్లో ఫుల్లుగా మందుకొట్టిన యువతులు ఖరీదైన కార్లను నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. సైనిక్ పురికి చెందిన సంజన అనే యువతి ఫుల్లుగా మందుకొట్టి కారు డ్రైవ్ చేయసాగింది. సంజనకు బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షించగా.. 93శాతం ఆల్కహాల్ పర్సంటేజ్ నమోదైంది. కుమారి అనే మరో యువతిని పరీక్షించగా.. 89 శాతం ఆల్కహాల్ పర్సంటేజ్ ఉన్నట్టు నిర్థారణ అయింది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 20 మందిపై కేసులు బుక్ చేసి.. 14 కార్లు, 6 బైకుల్ని సీజ్ చేశారు పోలీసులు.

అతి వేగంతో విద్యార్థి మృతి....

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45లో ముందు వెళ్తున్న కారును అతివేగంతో ఢీకొట్టారు బీటెక్ విద్యార్థులు. అదుపుతప్పిన కారు పల్టీలు కొట్టి బోల్తాపడింది. కారులో ప్రయాణిస్తున్న జతిన్ వర్మ అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని మిత్రులు నిఖిల్, కార్తీక్, రోహణ్ తీవ్రంగా గాయపడ్డారు. మద్యం తాగిన మైకంలో అజాగ్రత్తతో కారు నడపడటమే ప్రమాదానికి కారణమంటున్నారు పోలీసులు..

Similar News