డేరా బాబా రికార్డ్ బద్దలు కొట్టిన యోగి

Update: 2017-10-19 02:30 GMT

గుర్మీత్ రామ్ రహీం డేరా బాబా పేరిట వున్న గిన్నిస్ బుక్ రికార్డ్ బద్దలైంది. ఆ రికార్డ్ బద్దలు కొట్టింది ఎవరో కాదు సాక్షాత్తు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్. ఇంతకీ ఆ రికార్డ్ ఏమిటి అంటే దీపోత్సవం. గుర్మీత్ గత ఏడాది ఈ రికార్డ్ ను హర్యానా లోని సిర్సా లో సాధిస్తే యోగి ఉత్తరప్రదేశ్ లో పాత రికార్డ్ ను చెరిపేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. అయోధ్యలోని సరయు నదీతీరం ఈ మెగా ఈవెంట్ కి వేదిక గా నిలిచింది .

ఎలా సాధించారు...?

హర్యానా లోని సిర్సా లో గత ఏడాది సెప్టెంబర్ 23 న డేరా బాబా 153009 దీపాలను ఒకేసారి వెలిగించి గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కారు. అదే కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సరయు ఘాట్ లో విద్యార్థులు , ఎన్ సిసి క్యాడెట్లు తో ఒకేసారి రెండు లక్షల దీపాలను వెలిగించారు. సరయు తీరం దేదీప్య కాంతులతో ఒక్కసారిగా భాసిల్లింది. పాత రికార్డ్ చెరిగి కొత్త రికార్డ్ నమోదు అయిపొయింది. అసలే ఇటీవల ఆసుపత్రుల్లో చిన్నారుల మరణాలు తాజ్ మహల్ పై వివాదాలతో మసకబారిన యోగి ప్రతిష్ట తాజా ఈవెంట్ తో ఒక్కసారిగా ప్రజల్లో క్రేజ్ పెంచి ఆయన ముఖంలో వెలుగులు నింపేలా చేసింది. దాంతో యూపీని ఇప్పుడు పర్యాటకంగా నంబర్ వన్ లో ఉంచుతా అంటూ ప్రకటించారు యోగి .

Similar News