ట్వీట్లే రాహుల్ అస్త్రాలా?

Update: 2018-03-26 18:29 GMT

ప్రధాని మోడీ పై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రధాని మోడీ పేరిట వున్న యాప్ డౌన్ లోడ్ చేసుకున్న వారి వ్యక్తిగత సమాచారం అంతా అమెరికా చేతిలోకి వెళుతుందని రాహుల్ యువతను హెచ్చరించారు. హాయ్ నా పేరు నరేంద్ర మోడీ. ఇండియా ప్రధాన మంత్రిని. మీరు నా అధికార యాప్ లో సభ్యులు అయితే చాలు మీ మొత్తం పర్సనల్ డేటాను అమెరికా లోని నా వివిధ కంపెనీ మిత్రులకు పంపిస్తా. అంటూ ఫ్రెంచ్ హ్యాకర్ ఇలియట్ ఆండర్సన్ చెప్పిన అంశాలు ఒక పిక్ జత చేసి పోస్ట్ చేశారు రాహుల్. ఇది పెను దుమారాన్నే దేశంలో సృష్టిస్తుంది.

ఇలియాట్ గతంలో చెప్పిన అంశాలు....

ఇలాంటి సమాచార తస్కరణలపై గతంలో ఇలియట్ చేసిన ఆరోపణలు నిజం అని తేలాయి. దాంతో ఇప్పుడు రాహుల్ ట్వీట్ అందరిలో ఆందోళన రేకెత్తిస్తుంది. ఇటీవలే దేశంలో 15 లక్షల ఎన్ సి సి క్యాడెట్లు ప్రధాని యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని పిఎంఓ పిలుపునిచ్చింది. దాంతో వారంతా సభ్యులుగా కూడా చేరారు. ఇప్పడు తాజా వచ్చిన ఆరోపణలతో పిఎంఓ వివరణ ఇచ్చుకుంది. ఎన్ సిసి క్యాడెట్లతో ప్రధాని నేరుగా మాట్లాడి వారిని ప్రోత్సహించడానికి అలా చేశామే కానీ మరొకటి కాదని పేర్కొంది. మొత్తానికి రాహుల్ బహిరంగ సభల కన్నా ట్వీట్ లతో సామాజిక మాధ్యమాల్లో ఎదురు లేకుండా దూసుకుపోతూ మోడీ టీం కి నిద్ర లేకుండా చేస్తున్నాడు. గతంలో ఈ స్పీడ్ ప్రధాని కాకముందు నరేంద్ర మోడీ వినియోగించి సామాజిక మాధ్యమాల ప్రచారంలో టాప్ లో ఉండేవారు. ఇప్పడు ఆ స్థానం రాహుల్ భర్తీ చేయడం విశేషం.

Similar News