అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రసాస్వాదన బయటపెట్టిందో పోర్న్ స్టార్. స్టామి డేనియల్ అనే పోర్న్ స్టార్ తో ట్రంప్ గతంలో లైంగిక వేధింపులకు పాలపడ్డాడన్న వార్తలు గత కొద్దిరోజులుగా ప్రపంచ వ్యాప్తంగా తిరుగుతున్నాయి. తాజాగా డేనియల్ ఒక ప్రైవేట్ ఛానెల్ కి ట్రంప్ బాగోతాన్ని ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. ట్రంప్ తనతో వ్యవహరించిన తీరుతో పాటు ఈ విషయం బయటపెడితే తన ప్రాణాలే తీస్తానని ఒక ఆగంతుకుడు ద్వారా తన కుమార్తెకి బెదిరింపులు వచ్చాయని చెప్పింది.
బలవంతంగా అనుభవించాడు ...
ట్రంప్ తో తనకి ఒక గోల్ఫ్ కోర్ట్ ద్వారా పరిచయం అయ్యిందని, ఆ పరిచయాన్ని దుర్వినియోగం చేసి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడినట్లు డేనియల్ ఆరోపించింది. కండోమ్ కూడా ఉపయోగించకుండా ట్రంప్ దుర్మార్గంగా వ్యవహరించాడని ఛానెల్ కు తెలిపింది. ఈ విషయాలను బయటకు రాకుండా ట్రంప్ న్యాయవాదులతో ఒప్పందం జరిగిందని ఆ అగ్రిమెంట్ పై తనతో సంతకం పెట్టించుకుని ట్రంప్ సంతకం లేకుండా జాగ్రత్త పడ్డారని ఆరోపించింది. ట్రంప్ సంతకం ఎప్పుడైతో లేదో ఆ ఒప్పందం కూడా చెల్లదని తేల్చింది. అయితే ఈ ఆరోపణలను ట్రంప్ ఎప్పటినుంచో ఖండిస్తూ వస్తున్నారు. ఆమె చేసిన అభియోగాలను కూడా అమెరికా అధ్యక్షుడు కొట్టిపారేశారు. ఈ వివాదం తోసిపడేసినా ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ పై అల్లరి మాత్రం కొనసాగుతుంది.