టీడీపీకి నేడు శుభదినం

Update: 2017-11-23 03:51 GMT

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి ఈరోజు సాయంత్రం టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయన తన అనుచరులతో ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకోనున్నారు. పీలేరు నియోజకవర్గంలో గట్టి పట్టున్న నల్లారి కుటుంబం టీడీపీలో చేరుతుండటంతో తెలుగుదేశం పార్టీ బలం చిత్తూరు జిల్లాలో పెరిగే అవకాశముంది. నల్లారి కిశోర్ కుమార్ రెడ్డితో పాటు ఆయన తనయుడు అమర్ నాధ్ రెడ్డి కూడా టీడీపీలో చేరతారు. పీలేరు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు నల్లారి కుటుంబానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన నేడు టీడీపీలో చేరుతున్నారు. పీలేరు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చారు.

Similar News