టీడీపీ యాక్షన్ ప్లాన్ రెడీ....!

Update: 2018-02-05 03:36 GMT

టీడీపీ యాక్షన్ ప్లాన్ రెడీ అయింది. పార్లమెంటులో ఏపీ విభజన హామీలపై 193 నిబంధన కింద ఎంపీలు తోట నరసింహం, నిమ్మలకిష్టప్ప నోటీసులు ఇచ్చారు. పార్లమెంటులో ఈరోజు నిరసన తెలిపేందుకే టీడీపీ రెడీ అవుతుంది. కేంద్ర బడ్జెట్ లో తమకు జరిగిన అన్యాయంపై కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. పార్లమెంటులో ఈరోజు నిరసన తెలపాలని నిర్ణయించింది. అలాగే రాజ్యసభలో కూడా సభ్యులు టీజీ వెంకటేశ్, సీఎం రమేష్ లు నిరసన తెలియజేస్తారని చెబుతున్నారు. ఏపీ ఏం అడిగింది? కేంద్రం ఏం ఇచ్చింది? అన్న దానిపై కేంద్రాన్ని నిలదీయనున్నారు. పార్లమెంటులో గళం విప్పడానికి సిద్దమవుతున్నారు.

Similar News