టిడిపిలో గుబులు రేపుతున్న జగన్ పాదయాత్ర ..?

Update: 2017-10-26 11:30 GMT

తెలుగుదేశం పార్టీలో వైసిపి అధినేత జగన్ తలపెట్టిన పాదయాత్ర గుబులు రేపుతుందా ? అవుననే అంటున్నారు విశ్లేషకులు. 20 మంది ఎమ్యెల్యేలు టిడిపి చొక్కా తొడిగేసినా అధికారపార్టీకి విపక్ష యాత్ర భయం రేపుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. విపక్షం బలహీనంగా వున్నా అధికార పక్షంలో ఆందోళనకు మంత్రులు జగన్ పై చేస్తున్న ముప్పేట దాడే నిదర్శనమని చూపుతున్నారు. కోర్టు తీర్పు వచ్చే వరకు ఆ వ్యవహారం పైనా ఆ తరువాత పాదయాత్రకు తాము మినహాయింపు ఇవ్వలేమని కోర్టు ప్రకటించినా వైసిపి పై మంత్రుల దండకం ఆగక పోవడాన్ని వారు ఎత్తి చూపుతున్నారు.

ప్రత్తిపాటి, అచ్చెన్నాయుడు , ఆదినారాయణ రెడ్డి కి అదే పని ....

మంత్రులు ఆదినారాయణ రెడ్డి , అచ్చెన్నాయుడు , ప్రత్తిపాటి పుల్లారావు జగన్నామస్మరణతోనే రోజు ప్రారంభించి ముగిస్తున్నారు. వైసిపి పై మైండ్ గేమ్ లో భాగంగా వారు ఇలా చేస్తున్నారు. అయినప్పటికీ నిత్యం టిడిపి సాగిస్తున్న విమర్శల ధోరణి ఒక్కోసారి అదుపుతప్పుతుంది. తాజాగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని వైసిపి తీసుకున్న నిర్ణయం పట్ల టిడిపి పెద్ద ఎత్తునే విమర్శలకు ఆరోపణలకు వాడుకుంటుంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అసెంబ్లీ అంటే జగన్ కి లెక్కలేదంటూ దాడి మొదలు పెట్టి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. నంద్యాల ఎన్నికల ప్రభావమో ఏమో కానీ వైసిపి గతానికి భిన్నంగా టిడిపి విమర్శలపై ఆచితూచి స్పందిస్తుంది. చంద్రబాబు దగ్గర నుంచి అందరిని గౌరవ సంబోధనలు అధినేత నుంచి పార్టీ క్యాడర్ వరకు చేయడం కనిపిస్తుంది.

Similar News