నువ్వు ద్రోహం చేశావు, నేను కాదు నువ్వు అలా చేసింది అంటూ గత నెల నుంచి టిడిపి, బిజెపిలు ఒకరిపై మరొకరు బ్లేమ్ గేమ్ మొదలు పెట్టాయి. ఏపీకి అన్యాయం జరిగింది అంటూ ఎపి ప్రభుత్వం, ఎవ్వరూ చేయని సాయం చేశామని కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రానికి రాసిన లేఖతో ఇద్దరిమధ్య అగాధం మరింతగా ప్రజ్వరిల్లుతుంది. షా కు కౌంటర్ ను అసెంబ్లీ వేదికగా బాబు చెప్పేశారు చంద్రబాబు.
నిందలు తప్ప పనికొచ్చేది ఒక్కటి లేదు...
రాష్ట్ర ప్రజలు రాజకీయ పార్టీలపై విసిగి వేసారినా, బిజెపి టిడిపిలు చెప్పిందే చెబుతూ ప్రజలను మరింత గందరగోళానికి నెట్టేస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరిదీ తప్పో లెక్కకట్టడమే గగనం అయ్యింది. సాక్షాత్తూ అసెంబ్లీని వేదిక చేసుకుని గత కొద్దిరోజులుగా బిజెపిని కడిగేస్తున్నారు. ఈ పద్ధతి బావుండటంతో ముగిసిపోవాలిన అసెంబ్లీని సైతం పొడిగించి మరీ తిట్టేస్తున్నారు. ఇలా సాగుతున్న రాజకీయాల్లో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా 9 పేజీలతో కూడిన లేఖ రాసి ప్రశ్నలు సంధించారు. వీటిని అసెంబ్లీలోనే ఖండిస్తున్నారు. అలా గత కొన్ని వారాలుగా ఒక పార్టీని మరో పార్టీ ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవడంతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే అసెంబ్లీలో ప్రజల సమస్యలను అసలు సక్రమంగా ప్రస్తావించిన పాపానికి పోలేదు.
జనసేనాని నిలదీశారు....
వాళ్ళు హోదా ఇవ్వరు... వీళ్ళకు తెచ్చే సత్తాలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా విమర్శిస్తూ లేఖ రాశారు. ఎంతకాలం ఇలా ప్రజలను మోసం చేస్తారని నిలదీశారు. అటు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఏపీలో విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారపార్టీకి చీమ కుట్టినట్లైనా లేదని మండిపడ్డారు. త్వరలో కమ్యూనిస్టులు, మేధావులతో కూర్చుని భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్నారు. మరి ఈ బ్లేమ్ గేమ్ ఆడుతున్న రెండు పార్టీలు ఎప్పుడు వాస్తవానికి వస్తాయో అర్ధం కానీ దుస్థితి.