టిడిపి పై బిజెపి స్కీం ఇదేనా ...?

Update: 2018-02-08 03:30 GMT

టిడిపి పై ఇటీవల బిజెపి నేతలు విరుచుకుపడటం వెనుక వ్యూహాత్మక దాడే అన్నది తేలిపోతుంది. బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, పురంధరేశ్వరి కొద్ది రోజులుగా టిడిపి లో ప్రకంపనలు పుట్టించారు. ఇందులో వీర్రాజు మాట్లాడిన మాటలకు టిడిపి కమలనాధులను వదిలి బయటకు వచ్చేయాలి. అంతకుముందు బిజెపి శాసన సభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు టిడిపి పై విరుచుకుపడి ఆ వ్యాఖ్యలు తన వ్యక్తిగతమంటూ తప్పించుకున్నారు. ఆ తరువాత సోము వాడి వ్యాఖ్యలు టిడిపి లో వేడి పుట్టించాయి. ఈ వివాదాన్ని కూడా సోము వ్యక్తిగతమని బిజెపి లో చంద్రబాబు అనుకూల వర్గం కామినేని తదితరులు కొట్టి పారేసి వాతావరణాన్ని చల్లార్చే ప్రయత్నం చేసింది. అంతే కాదు సోము పై టిడిపి శ్రేణులు ధర్నాలు చేయడం దిష్టి బొమ్మల దహనం చేసినా ఆ పార్టీ వర్గాలు మద్దత్తుగా రాకపోవడంతో ఇది సోము వరకే పరిమితమని అనుకునేలాగే వ్యవహారం నడిచింది. అయితే తాజాగా కన్నా లక్ష్మీ నారాయణ రంగంలోకి దిగారు. ఆయన కూడా ఎటాక్ మొదలు పెట్టేశారు. అది నేరుగా టిడిపి తప్పులను పెద్దఎత్తున ఎత్తి చూపిస్తూనే.

స్కెచ్ గీసి ఉచ్చులోకి లాగుతున్న బిజెపి ...

టిడిపి కి చుక్కలు చూపించడమే లక్ష్యంగా కేంద్ర పార్టీ డైరెక్షన్ లో రాష్ట్ర పార్టీలోని కొందరు ముఖ్యులు వ్యూహాత్మక మాటల దాడి చేస్తున్నారు. ఒక్కొక్కరుగా సీన్ లోకి వచ్చి పసుపు పార్టీని రేవు పెట్టి వెళ్ళుతున్నారు. దానిపై వివాదం చెలరేగితే అది ఆ నాయకుడి వ్యక్తిగతమని కొట్టేసేలా కేంద్ర నేతలు చెప్పుకొస్తున్నారు. ఇలా గిల్లి జోల పాడే స్కిం స్టార్ట్ చేసింది కాషాయ దళం. బిజెపి తాజా వైఖరి టిడిపి కి మరింత మంట పుట్టిస్తుంది. రోజుకో నేత తుక్కు తుక్కు కింద తిట్టినా పొత్తుపై నిర్ణయాన్ని ఎటు తేల్చుకోలేక సతమతమౌతుంది టిడిపి.

Similar News