టిఆర్ఎస్ టార్గెట్ ఇక కొడంగల్ ....!

Update: 2017-11-01 05:30 GMT

రేవంత్ రెడ్డి తన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ కి ఉపఎన్నిక ఆరునెలల్లో నిర్వహించాలిసి వుంది. దాంతో ఇప్పుడు టిఆర్ ఎస్ తన టార్గెట్ ను ఆ నియోజకవర్గంపై పెట్టింది. తెలంగాణాలో గులాబీ పార్టీకి గట్టి పోటీ ఇస్తున్నది కాంగ్రెస్. ఆ పార్టీలోకి రేవంత్ వెళ్ళడం రాహుల్ గాంధీ దృష్టిలో ప్రత్యేక ఇమేజ్ ఉండటంతో అధికారపార్టీకి ఈ సీటు ప్రతిష్టాత్మకం అయ్యింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే అసెంబ్లీ ఉపఎన్నిక కావడంతో తన సర్వశక్తులు ఒడ్డి రేవంత్ ను ఓడించే వ్యూహానికి ఇప్పటి నుంచే పదును పెడుతుంది.

రంగంలోకి జూపల్లి ...

ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావు కు టిఆర్ ఎస్ కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన రేవంత్ పై విమర్శలు గుప్పించడం ఆరంభించారు. టిటిడిపికి రాజీనామా కానీ ఆ తరువాత రేవంత్ కాంగ్రెస్ లో చేరడం టీ కప్పులో తుఫాన్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు జూపల్లి . రేవంత్ కాంగ్రెస్ లో ఇలా చేరారో లేదో డే వన్ నే ఆయనపై పొలిటికల్ వార్ మొదలు పెట్టేసింది గులాబీ దళం. దీనిని బట్టి టిఆర్ ఎస్ ఈ స్థానం గెలుచుకునే ప్రక్రియను స్టార్ట్ చేసిందనే విశ్లేషకులు చెబుతున్నారు .ఇప్పటికే రేవంత్ కొండగల్ వదిలిపెట్టి వేరే నియోజకవర్గానికి వెళతారంటూ టిఆర్ ఎస్ భారీ క్యాంపైన్ తన మీడియా లోను సోషల్ మీడియా లో ప్రారంభించడం వెనుక రాబోయే ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకునే అన్నది పొలిటికల్ టాక్.

తిప్పి కొడుతున్న రేవంత్ ...

మైండ్ గేమ్ తో స్టార్ట్ అయిన కొడంగల్ వార్ లో పదవికి రాజీనామా చేసిన రేవంత్ గట్టిగానే ప్రత్యర్థులపై దాడికి దిగారు. తాను చనిపోయే వరకు ఇక్కడి నుంచే పోటీ అని స్పష్టం చేయడంతో బాటు సోనియా కి అమేథి, చంద్రబాబు కు కుప్పం ఎలా ఉన్నాయో తనకు అంతే అని ప్రకటించారు. రాబోయే ఉపఎన్నిక గెలిచి జనంలో కేసీఆర్ కి క్రేజ్ లేదని సార్వత్రిక ఎన్నికలపై సమరాన్ని ఉత్సహంగా సాగించాలన్నది రేవంత్ ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరి కేసీఆర్ కొడంగల్ ను అంత తేలిగ్గా తీసుకుని తన ఇమేజ్ కి డ్యామేజ్ తెచ్చుకుంటారా ? లేక విజయం సాధించి మొగ్గలోనే రేవంత్ రాజకీయ భవితను ప్రశ్నార్ధకం చేస్తారో వేచి చూడాలి.

Similar News