కత్తి మహేష్.. ఇటీవల కాలంలో విస్తృతంగా మీడియాలో కనిపిస్తున్న సినీ క్రిటిక్ పవన్‌పై ఎడా పెడా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ ఫ్యాన్స్‌తో తీవ్రంగా చర్చలకు దిగుతూ విమర్శలు సందిస్తున్న కత్తి నోటికి ఇకపై తాళం పడనుందా? కత్తికి మరోకత్తి సమాధానం ఇచ్చేందుకు రెడీ అవుతోందా? అది కూడా కత్తి మహేష్ ఎవరిపైనైతే.. ఆరోపణలు చేస్తున్నాడో అదే పవన్ టీం నుంచి కత్తి లాంటి వ్యక్తి మీడియా ముందుకు వచ్చి పవన్ తరఫున మైకులు పగల కొట్టేందుకు సిద్ధం అవుతున్నాడా? అంటే తాజా పరిణామాలను బట్టి ఔననే సమాధానమే వస్తోంది. విషయంలోకి వెళ్తే.. గత కొన్నాళ్లుగా కత్తి మహేష్.. పవన్‌పై వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. తీవ్రంగా పవన్‌ను విమర్శిస్తున్నాడు కూడా.
సంపూ... మద్దతు...
ఈ క్రమంలో కత్తిని అదుపు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వచ్చినా.. కత్తికి సరైన రేంజ్‌లో షాక్ ఇవ్వడం లేదు. దీంతో పవన్‌ను విమర్శించడం కత్తి మానడం లేదు. ఇక, ఇప్పుడు ఈ లోటు భర్తీ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. కత్తికి కత్తిలాంటి మొగుడు జనసేన నుంచి వచ్చేందుకు ముహూర్తం ఒక్కటే లేటు అన్నట్టుగా ఉంది పరిస్థితి. తొలి చిత్రంతోనే పేరు సంపాదించుకున్న క్యామెడీ హీరో సంపూర్ణేష్ బాబు.. . ఇప్పుడు అన్ని విధాలా పవన్‌కు అండదండగా నిలిచేందుకు ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం తెలంగాణలో యాత్ర ప్రారంభించిన పవన్..కు మద్దతు ఇచ్చేందుకు పవన్ చెంతకు వెళ్లి కలిసిన సంపూ.. పవన్ వెంట నడిచేందుకు తాను సిద్ధమని ప్రకటించాడు.
పవన్ తనకు స్ఫూర్తి....
పవన్‌తో కలిసి నడవడానికి సిద్ధమని , తనతో పాటు ఎన్నో కోట్ల మందికి పవన్ కళ్యాణ్ స్ఫూర్తి దాయకమని తెలిపారు. అంతే కాదు పవన్ కళ్యాణ్ కోసం ఏమైనా ఏమైనా సరే తోడు అందించడానికి తను సిద్ధమని చెప్పడం గమనార్హం. సంపూర్ణేష్ బాబు ఉండే ప్రాంతం కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్. ఆయన సిద్ధిపేట నియోజకవర్గానికి చెందినవాడు. పవన్ కళ్యాణ్ ని తెలంగాణా జిల్లాల్లో కూడా తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. దాన్ని ఉద్దేశించే జనసేన తరపున పోటీ చెయ్యడానికి సిద్ధ పడుతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు పవన్ కళ్యాణ్ ఎక్కడినుండి పోటీ చేస్తే దానికి పోటీ గా తాను రంగంలోకి దిగుతా అని కత్తి మహేష్ చెప్పిన విషయం తెలిసిందే.
త్వరలోనే జనసేనతీర్థం....
ఈ క్రమంలో మహేష్ కత్తిపై సంపూని పోటీగా దించాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే, సంపూర్ణేష్ బాబు త్వరలో జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నాడు అన్నమాట. అంతే కాదు జనసేన కు నిజమైన గొంతు లేక ఇన్ని రోజులు మూగబోయింది అని , పవన్ కళ్యాణ్ ని ఏమైనా అంటే దానికి సరైన సమాధానం ఇవ్వడానికి తాను సిద్ధం అని తెలుస్తోంది. దీంతో కత్తి మహేష్‌కు సరైన మొగుడు దొరికి నట్టేనని అంటున్నారు. విశ్లేషకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.