జోనల్ కు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

Update: 2017-10-11 05:30 GMT

రాష్ట్రంలో కొత్తగా చేపట్టబోయే ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో జోనల్ వ్యవస్థ ఉండాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. జోనల్ వ్యవస్థ లేకుంటే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లోని యువత నష్ట పోతుందని గుర్తించింది. ప్రస్తుతం ఉన్న రెండు జోన్లకు అదనంగా మరికొన్ని జోన్లను ఏర్పాటు చేయాని ప్రభుత్వం భావిస్తుంది. జోనల్ వ్యవస్థపైన, కొత్త జోన్ల ఏర్పాటు పైన సమగ్ర నివేదిక అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం మంత్రులు, అధికారులతో కమిటీని కూడా వేశారు. జోనల్ వ్యవస్థతో పాటు స్థానికతను కూడా పునర్నిర్వచించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ కొన్ని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే స్థానికత పై మాత్రం కేసీఆర్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

ఇప్పడు అన్యాయం చేయకండి......

జోనల్ వ్యవస్థ లేకుంటే కేవలం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన యువకులే లబ్డిపొందుతున్నారని, ఆదిలాబాద్, మంచిర్యాల, మహబూబ్ నగర్, ఖమ్మం వంటి వెనకబడిన జిల్లాల్లో యువత తీవ్రంగా నష్టపోతుందన్న అభిప్రాయం సర్వత్రావ్యక్త మవుతోంది. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం జోనల్ వ్యవస్థ కొనసాగింపుకు నియమించే కమిటీలో తెలంగాణకు చెందిన అధికారులు ఉంటేనే న్యాయం జరుగుతుందని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. అప్పుడే సరైన నివేదిక అందే అవకాశం ఉంటుందని సంఘాలు బహిరంగంగానే చెబుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రలో మూడు జిల్లాలకు కలిపి ఒక జోన్ ను ఏర్పాటు చేస్తే, తెలంగాణలోనిపది జిల్లాలకు కలిపి రెండే జోన్లు ఏర్పాటు చేసి అప్పుడే అన్యాయం చేశారని, ఈసారి అలా జరగకూడదని నిరుద్యోగ యువత కూడా కోరుకుంటుంది. మొత్తం మీద జోనల్ వ్యవస్థ కారణంగా వెనకబడిన జిల్లాల్లోని నిరుద్యోగ యువత లబ్దిపొందే అవకాశముంది.

Similar News